For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సింగర్ సునిత నిజజీవితమేనా ఈ "రాగం"... లేక గాసిప్ లేనా?

  |

  ఒక రచయిత కథ రాసుకున్నప్పుడో, ఒక దర్శకుడు కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నప్పుడో కొన్ని నిజజీవితం లో ఉన్న సంఘటనలని ఆ కథలో భాగం చేయటం కొత్థేం కాదు. కొన్ని సార్లు తమ సొంత జీవితాన్నే మెయిన్ పాయింట్ గా తీసుకోని సినిమాలు తీయటమూ జరిగింది. అయితే ఈ మధ్య సింగర్ సునీత చేసిన షార్ట్ ఫిలిం రాగం విషయం లో కూడా ఇదే విషయం లో వినిపిస్తున్న వార్తలు "రాగం" వైపు అందర్నీ లాగుతున్నాయి. ఒక ఒంటరి మహిళ గా తన కష్టాలనీ, తాను వైవాహిక జీవితం లో ఎదుర్కొన్న సమస్యలనీ ఆమధ్య మీడియా ముందుంచిన సునిత.... ఆ ఇంటర్వ్యూ తర్వాత చేసిన మొదటి షార్ట్ ఫిలిం ఇదే కావటం తో కొంత ఆసక్తి నెలకొంది...

  ''రాగం'' అనే షార్టు ఫిలింలో సునీత తొలిసారిగా ముఖానికి మేకప్ వేసుకుని యాక్టింగ్ టాలెంట్ చూపించింది. ఇన్నాళ్లూ ఎంతమంది దర్శకులు నటించమని అడిగినా కూడా నో చెప్పేసిన సునీత.. ఇప్పుడు మాత్రం ఎందుకు ఒప్పుకుంది? అందుకే ఆ కథే కారణం అని చెప్పాలేమో. ఒంటరిగా జీవిస్తూ ఒక మహిళ తన కాళ్ళ మీద తాను నుంచుంటే.. ఆమె లేటుగా ఇంటికి వస్తే 'ఎక్కడికి వెళ్లొస్తుందో' అంటూ సాగదీసే పొరుగువారు.. అదే ఆమెకు ఆఫీసులకు ఒక అవకాశం వస్తే.. 'బాసుతో క్లోజ్ గా ఉందిలే' అంటూ కామెంట్లు చేసే సహోద్యోగులు.. ఇలాంటివారితో చాలా ఇబ్బందులే పడుతుంటారు. పోనివ్ లే అని వదిలేయలేం.. అలాగని పట్టించుకుంటే మనకు ఇంకా నరకంగా ఉంటుంది. సరిగ్గా అలాంటి ఓ ఒంటరి మహిళ కథే ఈ షార్ట్ ఫిలిం.

  అయితే దగ్గరగా చూస్తే.. నిజానికి ఆరేళ్ల నుండి తన భర్త నుండి విడిపోయి ఒంటరిగా తన తల్లిదండ్రులు అండ్ పిల్లలతో కలసి జీవిస్తున్న రియల్ లైఫ్ కూడా కాస్త ఇలాంటి వాస్తవానికి దగ్గరగానే ఉందనేది చెప్పడానికే సునీత ఈ ఫిలిం చేసిందా అనే సందేహం.. ఈ మధ్య కాలంలో ఆమె ఇంటర్యూలను చదువుతున్నవారందరికీ వస్తోంది.ప్రేమ వివాహం చేసుకున్న సునీత భర్త తో విభేదాలు వచ్చి ఇద్దరు పిల్లలతో విడిగా ఉంటున్నారు. ఆయనతో ఎదురైన అనుభవాలను ఆమె చాలా ఇంటర్వ్యూల్లో చెప్పి బాధపడ్డారు. రోలింగ్ రోల్ పతాకంపై శ్రీ చంటి ఈ సినిమా ను రూపొందించారు. బహుముఖ ప్రజ్ఞ ఉన్న సునీత త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించే సినిమాలోనూ నటించనుందని సమాచారం.

  English summary
  Singer Sunitha Upadrashta has now stepped into the field of acting with the short film Raagam featuring Singer Sameer , Sai Kiran and Sana Shanoor. It is a debut film of melody queen singer Sunitha Upadrashta that is directed by Sree Chaitu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X