Don't Miss!
- Finance
Stock Market: వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయ్..? ట్రేడర్స్ గుర్తించాల్సిన విషయాలు..
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- News
Wife: నువ్వు ఎంజాయ్ చెయ్యడానికి నా భార్య కావాలా ?, నువ్వు అంత మగాడివా రా ?, ఇద్దరూ క్రిమినల్స్!
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ఆ స్టార్ హీరో సినిమాలో సింగర్ సునీత.. మొదటిసారి సర్‌ప్రైజ్ చేసేలా స్పెషల్ రోల్
గాయనిగా మంచి గుర్తింపును అందుకున్న సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సినిమాలలో ఆమె పాడిన పాటలు సినిమా విజయాల్లో కూడా కీలక పాత్ర పోషించాయి. అంతేకాకుండా ఆమె ప్రముఖ హీరోయిన్స్ కు డబ్బింగ్ కూడా చెబుతూ ఉంటారు. ఇప్పటికీ కూడా కొంతమంది స్టార్ హీరోయిన్స్ కు ఆమె స్పెషల్ గా డబ్బింగ్ చెబుతూ సినిమాకు ఒక కొత్త ఫీలింగ్ అయితే తీసుకువస్తున్నారు. రీసెంట్ గా మణిరత్నం పాన్ ఇండియా మూవీ పోనియన్ సెల్వన్ 1 సినిమాలో ఐశ్వర్య పాత్రకు సునీత డబ్బింగ్ చెప్పింది.
అయితే మరోవైపు సింగర్ గా కూడా కొనసాగుతున్న ఆమె నటిగా కూడా తన ప్రయాణాన్ని కొనసాగించాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఆమెకు సినిమాలో నటించే ఆఫర్స్ వచ్చాయి కానీ కెమెరా ముందు నటించడానికి సునీత ఒప్పుకోలేదు. బుల్లితెరపై మాత్రం ఆమె కొన్ని రియాల్టీ షోలలో కనిపించింది. ఇక పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా సునీత నటించింది. ఇక ఇప్పుడు మొదటిసారి ఆమె ఒక స్టార్ హీరో సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.

ఆ స్టార్ హీరో మరెవరో కాదు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అని తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు 28వ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందనున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు అక్క పాత్రలో సింగర్ సునీత నటించేందుకు ఒప్పుకున్నట్లుగా ఒక టాక్ అయితే వినిపిస్తోంది. అయితే నటిగా మాత్రం ఆమె మొదట నటించడానికి కాస్త భయపడినప్పటికీ త్రివిక్రమ్ పూర్తిస్థాయిలో ఆమెకు భరోసా కలిగించారట. మీరు డేట్స్ ఇస్తే చాలు చాలా ఈజీగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటామని కూడా త్రివిక్రమ్ మాట ఇవ్వడంతో సునీత నటించేందుకు ఒప్పుకున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ అయితే వినిపిస్తోంది. ఇక మహేష్ బాబుకు సోదరి పాత్రలో అంటే తప్పకుండా సున్నిత ఫర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని కూడా ఫాన్స్ అనుకుంటున్నారు. ఇక త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత విడుదల చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు.