»   » రిలీజ్ అపటానికి అనుష్క విశ్వ ప్రయత్నం

రిలీజ్ అపటానికి అనుష్క విశ్వ ప్రయత్నం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రీసెంట్ గా నాని హీరోగా వచ్చిన రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అందులో ఒక సినిమాకు మంచి పేరు వస్తే...రెండోది ఆనవాలు కూడా లేకుండా పోయింది. తాజాగా అలాంటిదే తెలుగు సిని పరిశ్రమ చూడబోతోంది. అనుష్క నటించిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదల చేయటానికి రిలీజ్ డేట్ ఇచ్చేసారు. అవి మరేవో కాదు సైజ్ జీరో, రుద్రమదేవి. రెండు చిత్రాలు అక్టోబర్ 9నే విడుదల చేయాలని నిర్ణయంచి ప్రకటనలు చేసారు. ఈ నేపధ్యంలో అనుష్క ఇరుకునపడినట్లైంది. దాంతో ఆమె పీవీపి వాళ్ళను కలిసి సైజ్ జీరో చిత్రం రిలీజ్ వాయిదావేయమని కోరుతున్నట్లు సమాచారం. అయితే వారు ఒప్పుకోలేదని పట్టుదలగా రుద్రమదేవి చిత్రంపైనే వేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

అనుష్క, ఆర్య ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'సైజ్‌ జీరో' . చిత్రం ప్రమోషన్ లో భాగంగా జీరో సైజ్ ..జీరో సైజ్ అనే సెక్సీ సాంగ్ ని యూనిట్ విడుదల చేసింది. ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. అనుష్క, ఆర్య, సోనాల్‌ చౌహాన్‌ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. అక్టోబర్‌ 9 న 'సైజ్‌ జీరో'ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఆ సాంగ్ వీడియోని ఇక్కడ చూడండి.ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


‘నేను లావుగా కనిపిస్తున్న లుక్ ఫేక్ కాదు. ఆ సినిమాకోసం నేను కార్బోహైడ్రేట్స్ తీసుకొని లావు అయ్యానని' అని అనుష్క తెలిపింది. 'సైజ్‌ జీరో' చిత్రంలో ఆమె లావుగా కనపడటం అబద్దమని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆమె టీవి 9 తో మాట్లాడుతూ ఇలా స్పందించింది. 17 కిలోలు ఆమె ఈ సినిమా కోసం పెరిగింది.


ఈ సినిమాలో అనుష్క రెండు విభిన్న షేడ్స్ లో కనిపించనుంది. దర్శ కేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనయుడు, ‘అనగనగా ధీరుడు' సినిమా దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. యం.యం.కీరవాణి సంగీత దర్శకుడు. ప్రసాద్ వి పోట్లురి నిర్మాత. ‘బాహుబలి', ‘రుద్రమదేవి' సినిమాల తర్వాత అనుష్క నటిస్తున్న మరో భారి బడ్జెట్ ఫాంటసీ సినిమా ఇది .


Size zero : Anushka Trying To Stop Release

యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం ప్రముఖ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కథ, కథనాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు. కోవెలమూడి ప్రకాష్ భార్య ఈ నవలను రాసినట్లు తెలుస్తోంది.


ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా ఆర్యా, భరత్, ఉర్వసీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హీరోయిన్ శృతిహాసన్ గెస్ట్ రోల్ చేస్తున్నారు.


ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో షూటింగ్ చేస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి ప్రకాష్ కోవెలమూడి భార్య అయిన కనిన ధిల్లన్ కథ - స్క్రీన్ ప్లే అందించింది.

English summary
While 'Rudramadevi' is fixed for October 9th, recently makers of 'Size Zero' announced that they are also in race for same day. According to grapevine, Anushka is in consultations with producer PVP and asking him to postpone the release of 'Size Zero.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu