For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sonakshi Sinha టాలీవుడ్ డైరెక్టర్‌కు షాక్.. సమంత, నయనతార రేంజ్‌లో రెమ్యునరేషన్ డిమాండ్

  |

  బాలీవుడ్‌లో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో దబాంగ్ లాంటి భారీ బ్లాక్‌బస్టర్‌తో కెరీర్ ప్రారంభించినా.. ఆ తర్వాత టాప్ హీరోయిన్‌గా ఎదిగేందుకు నానా తంటాలు పడుతున్నారు. మంచి కంటెంట్‌తో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో తన సినిమాల ఎంపికపై డిఫెన్స్‌లో పడిపోయారు. అయితే ఇటీవల కాలంలో పెద్దగా గుర్తింపు పొందిన పాత్రలు చేసినట్టు కనిపించలేదు. కానీ టాలీవుడ్‌లో అడుగు పెట్టేందుకు అదృష్ట దేవత తలుపుతట్టిందనే వార్త ఇప్పుడు అభిమానులను సంతోషానికి గురి చేస్తున్నాయి. చిరంజీవితో చేయడానికి సిద్ధమైన సోనాక్షి సిన్హా కెరీర్ గురించి.. ఆమె రెమ్యునరేషన్ గురించి మరిన్నీ వివరాలు..

  2014లో దక్షిణాది చిత్ర పరిశ్రమలో

  2014లో దక్షిణాది చిత్ర పరిశ్రమలో


  హిందీలో కెరీర్ పరంగా ఇబ్బంది పడుతున్నట్టు కనిపించిన సమయంలో సోనాక్షి సిన్హాకు ఊరట లభించే అవకాశం లభించింది. ఏకంగా రజనీకాంత్‌తో జతకట్టే అవకాశం రావడంతో దక్షిణాదిలో అడుగుపెట్టింది. 2014లో లింగా చిత్రంలో నటించినా.. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో సౌత్ ద్వారాలు మూసుకుపోయాయి. అప్పటి నుంచి సోనాక్షి సిన్హా దక్షిణాది ముఖం చూడలేదు.


  అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫొటోస్.. మరోసారి అదిరిపోయేలా గ్లామర్ ట్రీట్

  చిరంజీవితో కలిసి నటించే ఆఫర్

  చిరంజీవితో కలిసి నటించే ఆఫర్

  ఇక దాదాపు ఏడేళ్ల తర్వాత మళ్లీ దక్షిణాదిలో మరోసారి ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమకు తొలిసారి పరిచయం కాబోతున్నది. మెగాస్టార్ చిరంజీవితో జై లవకుశ దర్శకుడు బాబీ రూపొందిస్తున్న చిత్రంలో సోనాక్షిని ఎంపిక చేయాలని టీమ్ నిర్ణయించుకొన్నది. ఆ మేరకు ఆమెతో సంప్రదింపులు జరిపారు. ప్రస్తుతం సోనాక్షితో చర్చలు జరుగుతున్నాయి అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

  టాప్ తీసేసి షాకిచ్చిన పూనమ్ బజ్వా: అందాల ఆరబోతలో గేట్లు ఎత్తేస్తూ.. ఓ రేంజ్‌లో చూపించిన హీరోయిన్

  దర్శకుడు బాబీ చెప్పిన స్క్రిప్ట్‌తో

  దర్శకుడు బాబీ చెప్పిన స్క్రిప్ట్‌తో


  సోనాక్షి సిన్హాకు ఇటీవలే దర్శకుడు బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర స్క్రిప్టు చెప్పారు. అయితే ఆమెకు కథ, కథనాలు, పాత్ర నచ్చడంతో చిరంజీవితో సినిమా చేసేందుకు ఎగిరి గంతేశారు. ఈ సినిమా కథనం బాగా నచ్చిందనే విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారని తెలిసింది. దీంతో ఆమె టాలీవుడ్‌లో అడుగు పెట్టడానికి మార్గం సుగమమైంది.

  తల్లైనా తగ్గని కరీనా కపూర్: గ్లామర్ ట్రీట్‌తో సెగలు రేపుతోన్న సీనియర్ హీరోయిన్

  భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు..

  భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు..

  అయితే చిరంజీవి పక్కన నటించే అవకాశం పక్కన పెడితే... ఈ బాలీవుడ్ బ్యూటీ భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది. దాదాపు రూ.3.5 కోట్ల రెమ్యునరేషన్ అడిగింది. అయితే సోనాక్షిని ఎలాగైనా ఒప్పించి ఈ సినిమాలో నటింప చేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. పారితోషికం విషయంలో రాజీ పడేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని సినీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ బాలీవుడ్ బ్యూటీ పారితోషికంపై బెట్టు దిగుతుందా లేదా వేచి చూడాల్సిందే.

  Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
  సోనాక్షి సిన్హా కెరీర్ ఇలా...

  సోనాక్షి సిన్హా కెరీర్ ఇలా...

  బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్‌తో సోనాక్షి సిన్హా కలిసి నటించిన భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్లు ఓపెన్ కానీ పరిస్థితిలో ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 13వ తేదీన డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీ యాప్‌లో రిలీజ్ అవుతున్నది. భుజ్ చిత్రం సోనాక్షి ఖాతాలో మంచి హిట్‌గా చేరడం తథ్యమని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ఘూమ్‌కేతులో నటించింది. 2022లో కాకుడా చిత్రంలో నటిస్తున్నది.

  English summary
  Bollywood actress Sonakshi Sinha is set to step into tollywood. She is going to pairwith Chiranjeevi. Reports suggest that Dabaang heroine demands 3 crores above remuneration.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X