twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మన స్టార్ హీరోలు...కళ్లు చెదిరే రెమ్యునరేషన్స్ -1(ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఒకప్పుడు అంటే జీతానికి హీరోలు ..ప్రొడక్షన్ సంస్ధల్లో పనిచేసేవారు. కాలం మారింది..రెమ్యునేషన్స్ మారుతున్నాయి. ఇప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ లో 25% నుంచి 50% వరకూ హీరోల రెమ్యునేషన్స్ ఉంటున్నాయి. మిగతా బడ్జెట్ లో మిగతా ఆర్టిస్టులు, లొకేషన్స్, ప్రొడక్షన్ ఖర్చు చెయ్యాల్సిన పరిస్ధితి ఏర్పడింది.

    అయితే హీరోలను చూపించే బిజినెస్ చేస్తున్న నేపధ్యంలో ఈ మార్పు అనివార్యం. చాలాసార్లు ఫిల్మ్ ఛాంబర్ ఈ విషయమై చర్య తీసుకోవాలని, హీరోల రెమ్యునేషన్స్ పై కోత విధించాలని నియమ,నిబంధనలు పెట్టింది. అయితే దాన్ని పెద్ద నిర్మాతలే ఉల్లంగించారు.

    డిమాండ్,సప్లై రూల్ ...హీరోల రెమ్యునేషన్ విషయంలో జరుగుతూంటుంది. హీరోలు మేమేమన్నా ఎక్కువ అడుగుతున్నామా...అంతా నిర్మాతలే పెంచుతున్నారు..ఇస్తున్నారు..అయినా మమ్మల్ని చూపించి బిజినెస్ చేస్తున్నప్పుడు ఆ మాత్రం తీసుకోవటంలో తప్పేముంది అని వాదిస్తున్నారు.

    గమనిక: క్రింద చెప్పబడే రెమ్యునేషన్స్ ...ట్రేడ్ లో ప్రచారంలో ఉన్నవి మాత్రమే అని గమనించగలరు...

    హీరోలు...రెమ్యునరేషన్స్... స్లైడ్ షోలో...

    రజనీకాంత్

    రజనీకాంత్

    సౌత్ ఇండియాలో ఎక్కువ తీసుకునే హీరో ఎవరంటే రజనీకాంత్ అని చెప్పవచ్చు. ఈ తమిళ సూపర్ స్టార్... దాదాపు 30 కోట్ల వరకూ తన తాజా చిత్రం లింగా కు ఛార్జ్ చేస్తున్నారని వినికిడి.

    కమల్ హాసన్

    కమల్ హాసన్

    రజనీ తర్వాత సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ తీసుకునే హీరో కమల్ హాసన్. ఆయన విశ్వరూపం చిత్రానికి గానూ 25 కోట్ల రూపాయలు రెమ్యునేషన్ గా తీసుకున్నారు.

    పవన్

    పవన్

    పవన్ కళ్యాణ్ ...గబ్బర్ సింగ్ 2 చిత్రానికి కానూ 18 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. తెలుగు నుంచి పవన్ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నట్లు చెప్తున్నారు.

    విజయ్

    విజయ్

    సౌత్ నుంచి మరో హీరో విజయ్...రెమ్యునేషన్ లో టాప్ గేర్ లో ఉన్నారు. ఆయన వేలాయుధం, నంబన్, తుపాకి చిత్రాల నుంచి రెమ్యునేషన్ పెంచుకుంటూ వస్తున్నారు. 17 నుంచి 18 కోట్లు వరకూ ఆయన వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

    సూర్య

    సూర్య


    యముడు, సింగం హీరో సూర్య కూడా విజయ్ తో సమానంగా దాదాపు రెమ్యునేషన్ వసూలు చేస్తున్నారు. ఆయన 15 నుంచి 18 కోట్లు వరకూ రెమ్యునేషన్ వసూలు చేస్తున్నట్లు సమాచారం.

    అజిత్

    అజిత్

    తమిళంలో సెకండ్ ఇన్నింగ్స్ లో స్టార్ గా వెలుగుతున్న అజిత్ కు ఫ్యాన్స్ అధికంగా ఉన్నారు. ఆయన కూడా 15 దాటే రెమ్యునేషన్ తీసుకుంటున్నారు.

    మహేష్ బాబు

    మహేష్ బాబు

    యాడ్స్ ద్వారా ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్న మహేష్ తన ఆగడు చిత్రానికి 16 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

    జూ.ఎన్టీఆర్

    జూ.ఎన్టీఆర్

    తెలుగులో మహేష్ తర్వాత రెమ్యునేషన్ ఎక్కువ తీసుకుంటున్న హీరో జూ.ఎన్టీఆర్. ఆయన తన రభస చిత్రానికి గానూ 14 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

    విక్రమ్

    విక్రమ్

    తన నటనతో జాతీయ అవార్డుని కైవసం చేసుకున్న అరుదైన నటుడు విక్రమ్. ఆయనకి తమిళ, తెలుగులో మంచి ప్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాంతో ఆయన 12 కోట్లు వరకూ తీసుకుంటున్నట్లు సమాచారం.

    రామ్ చరణ్

    రామ్ చరణ్


    తెలుగు నుంచి రామ్ చరణ్ ...విక్రమ్ తో సమానంగా వసూలు చేస్తున్నారు. తన తాజా చిత్రం గోవిందుడు అందరి వాడేలే కు 12 కోట్లు రెమ్యునేషన్ తీసుకుంటన్నట్లు సమాచారం.

    ప్రభాస్

    ప్రభాస్

    రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ ...టాలీవుడ్ లో తనదైన స్ధానం పొందారు. ప్రస్తుతం బాహుబలి చిత్రం కోసం ఆయన 10 కోట్లు ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది.

    అల్లు అర్జున్

    అల్లు అర్జున్

    యూత్ లో అల్లు అర్జున్ కి ఉన్న ఫాలోయింగ్ వేరు. స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ...రేసు గుర్రం చిత్రానికి గానూ 10కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

    ధనుష్

    ధనుష్

    బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అక్కడా జండా పాతిన రజనీ అల్లుడు ధనుష్ కు మంచి ప్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే అతను 8 కోట్లు సినిమాకు వసూలు చేస్తున్నాడు.

    శింబు

    శింబు

    లిటిల్ సూపర్ స్టార్ గా చెప్పబడే శింబు ...కి విభిన్నమైన చిత్రాలతో మంచి ఫ్యాన్స్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన కూడా ధనుష్ తో సమానంగా 8 కోట్లు వసూలు చేస్తున్నారు.

    కార్తీ

    కార్తీ

    సూర్య తమ్ముడు కార్తీ కి తొలినాటి నుంచి తెలుగులోనూ మంచి బిజినెస్ ఉంటూ వస్తోంది. అందుకే అతని రెమ్యునేషన్ ..ఈ రెండు భాషలని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్నాడు. అతను ఏడు నుంచి ఎనిమిది కోట్లు వరకూ వసూలు చేస్తున్నాడు.

    English summary
    Film heroes in South India are treated as demi gods on the earth and heroism plays a dominant role in the success of a film. The business of a movie always depends on the power and popularity of its lead actor. So the heroes take away at least 25% to 50% of production cost of a film as their remuneration.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X