For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Chiranjeevi Waltair Veerayya క్రేజీ న్యూస్.. అందుకోసం స్పెషల్ ట్రైన్.. ఎక్కడి నుంచి అంటే?

  |

  మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఆయన మరో చిత్రంతో అభిమానులను, ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా రానున్నది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఏసీపీ విక్రమ్ గా అలరించనున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ బాడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటేనే వివరాల్లోకి వెళితే..

  మాస్ ఎలిమెంట్స్ తో..

  మాస్ ఎలిమెంట్స్ తో..

  మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. యంగ్ ఏజ్ హీరోలకు సరిసమానంగా పోటీ ఇస్తూ జోష్ చూపిస్తున్నారు. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో కమ్ బ్యాక్ హిట్ కొట్టిన చిరంజీవి త్వరలో వాల్తేరు వీరయ్యగా రాబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్ టీజర్ మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ టీజర్ మాస్ ఎలిమెంట్స్‌తో అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

  అంచనాలకు అనుగుణంగా..

  అంచనాలకు అనుగుణంగా..

  ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. సుమారు 22 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి నటించిన ఈ వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు రానుంది. బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచానలు మాములుగా లేవు. ఆ అంచనాలకు తగినట్లుగానే ఈ చిత్రం పక్కా మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కినట్లు తెలుస్తోంది.

  గొడ్డలితో సిలిండర్ పట్టుకుని..

  గొడ్డలితో సిలిండర్ పట్టుకుని..

  ఇక ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించిన రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేశారు. అది సూపర్ ఎనర్జీతో అదరగొట్టింది. మేకపిల్లను ఎత్తుకొని.. గొడ్డలితో సిలిండర్ ను పట్టుకుని తన పేరుకు తగినట్లుగానే రవితేజ మాస్ ఎంట్రీ ఉంది. అంతేకాకుండా ఫస్ట్ టైమ్ ఒక మేకపిల్లను ఎత్తుకొని పులి వస్తుంది అంటూ వచ్చే వాయిస్ ఓవర్ నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్లింది. దీంతోపాటు ఫుల్ అండ్ ఎంటర్టైనింగ్ మాస్ యాక్షన్ సీన్స్ చూపించారు.

  పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం..

  పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం..

  ఇదిలా ఉంటే ప్రస్తుతం వాల్తేరు వీరయ్య మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం యూరప్ లో పాటలు చిత్రీకరిస్తున్న ఈ మూవీ షూటింగ్ లో ఎక్కువ భాగాన్ని వైజాగ్ లో చేశారు. దీంతో వైజాగ్ లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించాలను మూవీ యూనిట్ భావిస్తోందట. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తుండగా.. ఈ వేడుకకు పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది.

  వివిధ నగరాల గూండా..

  వివిధ నగరాల గూండా..


  చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యే అభిమానుల కోసం ఒక ప్రత్యేక రైలును ఏర్పాటు చేయనున్నారట. సికింద్రాబాద్ నుంచి ఈ స్పెషల్ ట్రైన్ సౌకర్యం కల్పించనున్నారని టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ సిటీల గూండా ప్రయాణించనున్న ఈ రైలు ఆయా నగరాల్లోని ఫ్యాన్స్ ను ఎక్కించుకోనుందని సమాచారం. ఇలా మెగా అభిమానులు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనేందుకు చర్చలు జరుగుతున్నాయని టాక్.

  గతంలో ఆంధ్రావాలాకు..

  గతంలో ఆంధ్రావాలాకు..

  అయితే ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కూడా మరో టాక్ నడుస్తోంది. మరి వాల్తేరు వీరయ్య ప్రి రిలీజ్ ఈవెంటను ఎలా నిర్వహించనున్నారో వేచి చూడాలి. ఇదిలా ఉంటే గతంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా మూవీ ఆడియో ఫంక్షన్ కోసం రాష్ట్ర నలుమూలల నుంచి రైళ్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కానీ, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది.

  English summary
  Hyderabad To Vizag Special Train For Megastar Chiranjeevi Ravi Teja Bobby Combination Movie Waltair Veerayya Pre Release Event In Vizag
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X