»   » సురేందర్ రెడ్డి, వక్కతం వంశీ మధ్య చీలిక!

సురేందర్ రెడ్డి, వక్కతం వంశీ మధ్య చీలిక!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కిక్, రేసు గుర్రం లాంటి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి రచయిత వక్కతం వంశీ అందించిన కథలతోనే ఆ పీట్ సాధించగలిగాడు. అయితే తాజాగా వీరి మధ్య చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపై ఇద్దరూ కలిపి పని చేసే అవకాశం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

వక్కతం వంశీ తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలకు కథలు అందించారు. ఆయనతో పాటు పని చేసిన రచయితలు దర్శకులుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. తాను అదే దారిలో దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్న వంశీ ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలనే ప్లాన్లో ఉన్నారు.

Split between the Suri and Vamsi

ప్రస్తుతం కిక్-2 సినిమా రీషూటింగులో బిజీగా ఉన్న సురేందర్ రెడ్డి ఈ మూవీ రిలీజ్ తర్వాత రామ్ చరణ్ తో సినిమాకు కమిట్ అయ్యాడు. అయితే ఈ సినిమాకు వక్కతం వంశీ వర్క్ చేయడం లేదని తెలుస్తోంది. ఈ సినిమాకు ఇద్దరూ కలిసి పని చేయక పోవడం...వీరి మధ్య చీలిక ఏర్పడిందనే వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. అయితే వీరి మధ్య చీలిక తాత్కాలికమేనా? శాశ్వతమా? అనేది తేలాల్సి ఉంది.

కాగా...రామ్ చరణ్-సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చే ఈ సినిమాకు కోన వెంకట్, గోపీ మోహన్ కలిసి పని చేస్తారని తెలుస్తోంది.

English summary
As per the close sources, Surender Reddy will be parting with star writer Vakkantham Vamsi, his favorite and most successful collaborator.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu