For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బ్రహ్మానందానికి హ్యాండిచ్చిన శ్రీను వైట్ల

  By Srikanya
  |

  హైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంకు దర్శకుడు శ్రీను వైట్లకు ఉన్న అనుబంధం తెలియంది కాదు. శ్రీను వైట్ల సినిమాల్లో మేజర్ రోల్ ప్లే చేసేది బ్రహ్మానందమే. అయితే ఈ సారి అటువంటిదేమీ లేదంటున్నారు. ఆగడు పరాజయంతో పూర్తిగా తన సినిమా డిజైన్ ని మార్చాలని ఫిక్స్ అయ్యాడంటున్నారు. అందులో భాగంగా బ్రహ్మానందంని ప్రక్కన పెట్టాడని చెప్పుకుంటున్నారు. బ్రహ్మానందం ప్లేస్ లో తమిళ కమిడయన్ సంతానం కు అవకాసమిస్తున్నట్లు సమాచారం. జనవరి 27న చిత్రం లాంచ్ అవుతుందని, మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది.

  రామ్ చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రంలో సంతానం కు ఓ డిఫెరెంట్ పాత్రను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ వెంట ఉండే పాత్రలో సంతానం నవ్వులు కురిపిస్తూనే, కథను ముందుకు నడపటానికి సాయపడతారని అంటున్నారు. రామ్ చరణ్ స్నేహితుడుగా బ్రహ్మానందం అయితే పెద్ద వయస్సు అవుతుంది కాబట్టి ఈ నిర్ణయిం తీసుకున్నట్లు చెప్పున్నారని వినిపిస్తోంది. మరో ప్రక్క తమిళంలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలోనే సంతానంకు అవకాసమిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఏదైమైనా ఈ వార్త నిజమైతే బ్రహ్మానందం కు మంచి క్యారెక్టర్ మిస్సయ్యినట్లే.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  Sreenu vytla Dumps Brahmanandam.. Ropes Santhanam

  అలాగే... శ్రీను వైట్ల సినిమాలన్నీ తొలినుంచీ రొమాంటిక్ కామెడీలుగా సాగుతూ వస్తున్నాయి. అయితే మహేష్ తో చేసిన దూకుడు చిత్రంతో యాక్షన్ కామెడీలను మొదలెట్టారు. అయితే ఆగడు చిత్రం డిజాస్టర్ కావటంతో మరోసారి తన జానర్ మార్చాల్సిన సమయం వచ్చిందని రామ్ చరణ్ భావిస్తున్నట్లుగా చెప్తున్నారు. రామ్ చరణ్ తనతో యాక్షన్ కామెడీ చేయవద్దని చెప్పినట్లు సమాచారం.

  దాంతో శ్రీను వైట్ల చాలా కథలు నేరేట్ చేసినట్లు తెలుస్తోంది. శ్రీను వైట్ల చెప్పిన రకరకాల స్టోరీలు, స్టోరీ పాయింట్లు విన్నాక... ఓ సస్పెన్స్ థ్రిల్లర్ వైపు రామ్ చరణ్ మ్రెగ్గు చూపినట్లు చెప్పుకుంటున్నారు. ఆ సస్పెన్స్ థ్రిల్లర్ ని కామెడీ తో చెప్పమని రామ్ చరణ్ అన్నట్లు గా తెలుస్తోంది. దాంతో ప్రస్తుతం తన జానర్ మార్చుకుని కథలో సస్పెన్స్ ని, థ్రిల్లింగ్ ని మెయింటైన్ చేస్తూ కథని వండుతున్నాడుట శ్రీను వైట్ల. మార్చి నుంచి ఈ చిత్రం పట్టాలు ఎక్కే అవకాసముందని తెలుస్తోంది.

  ఇక ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందనుంది. ఎస్.ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం అందించనున్నారు. అలాగే ఈ చిత్రం జనవరి 28న ప్రారంభం కానుందని తెలుస్తోంది. అదే రోజున షూటింగ్ సైతం ప్రారంభించనున్నారు. దసరా 2015కి సినిమా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

  అలాగే...రామ్ చరణ్ సరసన సమంత, శ్రుతి హాసన్, రకుల్ ప్రీతి సింగ్ వీరిలో ఇద్దరిని ఎంపిక చేస్తారు. శ్రుతి హాసన్ డేట్స్ దొరికితే ఆమే ఫస్ట్ ఛాయిస్. శ్రీను వైట్ల బ్రాండింగ్ తో తనకు ఓవర్ సీస్ లో మార్కెట్ పెరుతుందని రామ్ చరణ్ భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అక్కడే మహేష్ బాబు, రామ్ చరణ్ కు మధ్య పోటీ నడుస్తోంది.

  మరో ప్రక్క ఈ చిత్రానికి టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఫిలింనగర్‌ వర్గాల నుండి సమాచారం. ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ టైటిల్ విషయమై ఇప్పటి వరకు అటు రామ్ చరణ్ నుండి గానీ, ఇటు శ్రీను వైట్ల నుండి గానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

  మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రంలోని ‘మన భారతంలో పాండవులు, కౌరవులు రాజాలు రా' అనే సాంగ్ నుండి ఈ మూవీ టైటిల్ స్వీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇదే టైటిల్ ఫైనల్ చేస్తారా? లేక మరేదైనా టైటిల్ పరిశీలిస్తారా? అనేదానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఈ చిత్రం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది.

  English summary
  Director Srinu Vytla has dumped ace comedian Brahmanandam for his next film with Cherry.As per sources he is bringing Tamil star comedian Santhanam.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X