twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాపు 'శ్రీరామరాజ్యం' లో శ్రీహరి పాత్ర ఏమిటంటే...

    By Srikanya
    |

    బాపు, బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందుతున్న 'శ్రీరామరాజ్యం' చిత్రంలో శ్రీహరి ఓ కీలకపాత్రకు ఎంపికయ్యారు. ఈ చిత్రంలో ఆంజనేయస్వామిగా శ్రీహరిని తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ పాత్రకు నాగబాబుని అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ చురుకుగా ఉండే ఆంజనేయస్వామి పాత్ర శ్రీహరి అయితేనే బావుంటారని దర్శక, నిర్మాతలు భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇక శ్రీరామునిగా బాలకృష్ణ, సీతగా నయనతార నటించే 'శ్రీరామరాజ్యం' చిత్రం షూటింగ్ ప్రస్తుతం నిర్మాతల మండలి ఇచ్చిన స్ట్రైక్ తో ఆగింది.

    బాపు దర్శకత్వంలో శ్రీ సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముళ్లపూడి వెంకటరమణ రచన చేస్తున్నారు. ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఎనిమిది పాటల రికార్డింగ్ పూర్తయింది. ఇక శ్రీరాముడు రాజుగా పాలించిన ఘట్టమే ఈ చిత్రానికి ప్రధాన కథాంశం. ఉన్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారప. ఈ చిత్రానికి పాటలు: జొన్నవిత్తుల, వెన్నెలకంటి, సినిమాటోగ్రఫీ:పి.ఆర్.కె. రాజు, కూర్పు: జి.జి. కృష్ణారావు, కళ: రవీంద్ర, గ్రాఫిక్స్: కమల్ కణ్ణన్, డాన్స్: శ్రీను, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: తాండవ కృష్ణ, స్క్రీన్‌ప్లే, మాటలు: ముళ్లపూడి వెంకటరమణ.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X