Pelli sandaD: శ్రీకాంత్ కొడుకు సినిమాకు భారీ ఓటీటీ డీల్..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్న వారిలో రోషన్ ఒకరు. సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకైన రోషన్ గతంలోనే నిర్మల కాన్వెంట్ అనే ఒక సినిమా చేశాడు. కానీ ఆ సినిమా అంతగా క్లిక్కవ్వలేదు. ఇక ఇప్పుడు రీ లాంచ్ అవుతూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో పెళ్లి సందD అనే సినిమా చేశాడు.
గౌరీ రొనంకి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలా నటించింది. ఇక విడుదలకు సిద్దంగా ఉన్న ఈ సినిమాకు కరోనా దెబ్బ పడింది. థియేటర్స్ అయితే ఇప్పట్లో తెరచుకునే ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ థియేటర్స్ ఓపెన్ అయినా కూడా గతంలో మాదిరిగా మార్కెట్ నడుస్తుందా లేదా అనేది డౌట్ గానే ఉంది. ఇక పెళ్లి సందD సినిమాకు భారీ ఓటీటీ ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రిలీజ్ సాధ్యమయ్యే ఛాన్స్ లేదని పెట్టిన బడ్జెట్ కంటే డబుల్ రేటుకు ఆఫర్స్ వస్తుండడంతో నిర్మాతలు కూడా ఓటీటీ ఆఫర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వస్తోంది.

శ్రీకాంత్ తో 20ఏళ్ళ క్రితం చేసిన పెళ్లి సందడి ఏ తరహాలో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అప్పట్లోనే ఆ సినిమా దాదాపు 10కోట్ల వరకు లాభాలను అందించింది. కీరవాణి మ్యూజిక్ సినిమాకు ఎంతగానో బజ్ క్రియేట్ చేసింది. కె.రాఘవేంద్రరావు మ్యాజిక్ మరోసారి పర్ఫెక్ట్ గా సెట్టయ్యింది. ఇక అదే తరహాలో శ్రీకాంత్ కొడుకు కూడా నేటితరం పెళ్లి సందDతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి ఆ సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











