»   » మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్: నాగబాబు కూతురు ఎంట్రీ?

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్: నాగబాబు కూతురు ఎంట్రీ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు కుమార్తె నిహారిక ఇపుడు టాలీవుడ్లో హాట్ టాపిక్. అప్పట్లో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందని అంతా భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా 'ఢీ'-7 యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. తనదైన యాకరింగుతో, బబ్లీ యాటిట్యూడ్‌తో ఆకట్టుకుంటోంది నిహారిక. ప్రేక్షకులు, అభిమానులు నిహారిక సూపర్ అంటూ కితాబిస్తున్నారు.

ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు మాత్రమే వచ్చారు. త్వరలో ఆ ఫ్యామిలీ నుంచి సినిమా హీరోయిన్ కూడా రాబోతుందనే సంకేతాలు నిహారిక జోరు చూస్తుంటే స్పష్టమవుతుందనే ప్రచారం మొదలైంది. నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని నాగబాబు ఇప్పటికే ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే పలువురు నిర్మాతలు నాగబాబును కలిసి నిహారికను లాంచ్ చేయడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు టాక్. అయితే ఏ విషయమైనా నిహారికకే వదిలేస్తున్నాను. ఆమెను ఇది చేయొద్దు, ఇది చేయి అని బలవంతం పెట్టే ఉద్దేశ్యం తనకు లేదని, ఒక వేళ నిహారిక సినిమాల్లోకి వస్తానంటే గైడ్ గా ఉంటాను అని నాగాబాబు సదరు నిర్మాతలకు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

Stage Set For Niharika?

మరో వైపు నిహారిక కూడా ఏ విషయం తేల్చుకోలేక పోతోందట. టెలివిజన్ రంగం, సినిమా రంగం పూర్తిగా భిన్నమైంది. ఒక వేళ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే తలెత్తే పరిణామాల గురించి, లాభ నష్టాల గురించి నిహారిక బేరీజు వేసుకుంటున్నట్లు సమాచారం. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.

భవిష్యత్తులో నిర్మాతగా మారి సినిమాలు తీయాలనే ప్లాన్స్ ఉన్నాయని నిహారిక గతంలో చెప్పుకొచ్చారు. తండ్రి స్థాపించిన అంజనా ప్రొడక్షన్స్ బేనర్లో టీవీ సీరియల్స్, రియాల్టీ షోలు ప్లాన్ చేస్తున్నట్లు నిహారిక గతంలో చెప్పుకొచ్చారు. నిహారికలో సేవా భావం కూడా ఉంది. త్వరలో వాలంటరీ ఆర్గనైజేషన్ మొదలు పెట్టి పేద విద్యార్థులకు విద్యా అందించడానికి ప్లాన్ చేస్తోందట.

English summary
Latest news in T town is that Naga Babu's daughter Niharika has got the green signal to make her entry into films. It is known that she already hosts a couple of shows on TV and the audience have accepted her as a host.
Please Wait while comments are loading...