NBK 108: బాలయ్యతో పాన్ ఇండియా... ఆ డైరెక్టర్ అంటే ఫిక్స్ అవ్వాల్సిందే!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు కేవలం అఖండపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టిన బాలయ్య ఇక నెక్స్ట్ నుంచి మరిన్ని సినిమాలను లైన్ లో పెట్టాలని చూస్తున్నాడు. పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే ఒక సినిమాపై క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఒక మాస్ దర్శకుడితో కూడా కమిట్మెంట్ తీసుకున్న బాలకృష్ణ పాన్ ఇండియా సినిమా చేసే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే ఆ దర్శకుడు రెండు పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.

అఖండ టీజర్ తో భారీ క్రేజ్
బోయపాటి శ్రీను దర్శకత్వంలో సింహా, లెజెండ్ వంటి బాక్సాఫీస్ సినిమాల అనంతరం మూడవసారి చేస్తున్న సినిమా అఖండపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదివరకే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయగా బాలకృష్ణ అఘోరా పాత్రతో మంచి బజ్ క్రియేట్ చేశాడు.

గోపిచంద్ తో న్యూ మూవీ
అఖండ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం కాయంగా కనిపిస్తోంది. ఆ తరువాత వచ్చే సినిమాలు కూడా అంతకు మించి అనేలా ఉండాలని బాలయ్య ప్లాన్ చేసుకుంటున్నాడు. క్రాక్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో 107వ సినిమా చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఆ సినిమాలో కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగానే సీన్స్ ను రెడీ చేస్తున్నట్లు సమాచారం.

దర్శకులు సిద్ధంగా ఉన్నారు
క్రాక్ డైరెక్టర్ తో సినిమా చేసిన తరువాత బాలకృష్ణ ఎవరితో వర్క్ చేస్తారు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇక బాలకృష్ణ ఒప్పుకుంటే సినిమా చేయడానికి బడా దర్శకులు సిద్ధంగా ఉన్నారు. అనిల్ రావిపూడి కథను ఎప్పుడో రెడీ చేయగా పూరి జగన్నాథ్ తో కూడా మరో సినిమా ఉంటుందని బాలయ్య ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశాడు.

పూరి ఫిక్స్ అయితే.. పాన్ ఇండియా?
ఒకవేల పూరి జగన్నాథ్ లైగర్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకుంటే మాత్రం బాలకృష్ణతో చేయబోయే సినిమా(108) కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటుందని చెప్పవచ్చు. లైగర్ అనంతరం హిందీలోనే రణ్ వీర్ సింగ్ తో పూరి ఒక సినిమా చేయవచ్చని ఇటీవల టాక్ అయితే వచ్చింది. అలాగే యష్ తో కూడా ఉంటుందని అంటున్నారు. మరి ఈ లైనప్ లో బాలయ్యతో సినిమా ఎప్పుడు ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











