Just In
- 40 min ago
పవన్, చంద్రబాబు, లోకేష్ అంటే చాలా ఇష్టం.. దేవుడి మీద ఒట్టు.. జనసైనికులను కెలికిన ఆర్జీవీ
- 1 hr ago
చిరు-కొరటాల మూవీలో హీరోయిన్ ఫిక్స్.. పక్కా ప్రూఫ్.. సోషల్ మీడియాలో వైరల్
- 2 hrs ago
కమల్ పోస్టర్లపై పేడ.. వివాదానికి పుల్‌స్టాప్.. లోక నాయకుడిని కలిసిన లారెన్స్
- 3 hrs ago
సాగర తీరాన నడుమును తిప్పుతూ.. వయ్యారాలను ఒలకబోస్తోన్న శ్రియ
Don't Miss!
- News
ఎంపీ అర్వింద్ రాజీనామా చేయాలి... పసుపు రైతుల డిమాండ్
- Sports
ఆదుకున్న అయ్యర్, పంత్.. మెరిసిన జాదవ్.. విండీస్ లక్ష్యం 288
- Technology
గూగుల్ నుంచి ఎసెమ్మెస్ ఫీచర్, బిజినెస్ వ్యూహానికి పదును
- Finance
కిలో చికెన్ రూ 500... ఎక్కడో తెలుసా?
- Lifestyle
అంతర్జాతీయ ‘టీ‘ దినోత్సవం 2019 : ఆ ‘టీ‘ తాగితే మీ భాగస్వామిని బాగా సుఖపెట్టొచ్చు...
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
మెగా వారసుడికి తండ్రిగా స్టార్ హీరో.. వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్
సినిమాల్లో కొన్ని విలక్షణ కాంబినేషన్లకు భలే క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోలు తెర పంచుకోవడం, అదీ ఇంట్రెస్టింగ్ రోల్స్ పోషించడం ప్రేక్షకులను ఎంతగానో కనువిందు చేస్తుంది. అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ వెండితెరపై చూడబోతున్నాం అని తెలుస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తండ్రిగా స్టార్ హీరోను, తల్లిగా సీనియర్ స్టార్ హీరోయిన్‌ను ఫైనల్ చేశారట.
వైవిద్యభరితమైన కథాంశాలను ఎంచుకుంటూ వస్తున్న వరుణ్ తేజ్ ఇటీవలే 'గద్దలకొండ గణేష్' రూపంలో సూపర్ డూపర్ హిట్ సాధించారు. ఇదే జోష్‌లో ప్రస్తుతం తన 10వ సినిమా కోసం రెడీ అవుతున్నారు ఈ మెగా హీరో. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

కాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో వరుణ్ తల్లిదండ్రులుగా నటించే నటీనటులపై ఆసక్తికర విషయం బయటకొచ్చింది. వరుణ్ పేరెంట్స్‌గా రమ్యకృష్ణ, మాధవన్ నటించబోతున్నారని తెలిసింది. అంతేకాదు ఈ రెండు పాత్రలకి సినిమాలో ఎంతో ప్రాధాన్యముంటుందని తెలిసింది. అతిత్వరలో ఈ ఇద్దరి పాత్రలపై చిత్రయూనిట్ అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇవ్వనుందని టాక్. ఇదే జరిగితే తండ్రిగా మాధవన్, తల్లిగా రమ్యకృష్ణ, కొడుకుగా వరుణ్ దుమ్ముదులపడం ఖాయమే మరి.
ఇక ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ బాక్సింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారని తెలిసింది. అందుకే సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆలస్యమవుతోందని సమాచారం. విలక్షణ కథాంశంలో రాబోతున్న ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలవడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.