»   »  పవన్ 'పులి'కథ ఇదేనా?

పవన్ 'పులి'కథ ఇదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Pawan Kalyan
పవన్ కళ్యాణ్ హీరోగా ఖుషి ఫేమ్ ఎస్.జె.సూర్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పులి'కథ గురించి ఫిల్మ్ నగర్ లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వాటిల్లో ఎక్కువగా వినపడుతున్నది ...ఇలా ఉంది. పవన్ కళ్యాణ్ పోలీస్ కమీషనర్ గా చేస్తూ ప్రధాన మంత్రి సభకు సెక్యూరిటీ భాధ్యతలు స్వీకరించి ఆయన్నుప్రాణాలకు తెగించి ఓ టెర్రరిస్ట్ ఎటాక్ నుండి రక్షిస్తాడు.దాంతో అతనికి గోల్డ్ మెడల్ ఇస్తూ...గౌరవ వందనం ఇస్తారు. అంతేగాక ఆయన మెచ్చుకుంటూ తన ప్రాణాలకు రక్షించినందకు పవన్ ని ఏదైనా కోరుకోమంటాడు. అప్పుడు పవన్ ఓ సహాయం అర్దిస్తాడు.

దేశంలో అరాచకం అణుద్దామని ప్రయత్నించిన ప్రతీసారీ రాజకీయనాయకుల వల్ల మిగతా వారి వల్ల సమస్యలు వస్తున్నాయని అందుకే తనకు ప్రత్యేకమైన అథికారాలు ఇస్తే ఏదైనా చెయ్యగలను అంటాడు. అప్పుడాయన ఓ.కె అంటాడు. అక్కడ నుండి పవన్ పులి టీమ్ అని ఏర్పాటు చేసి మాటు వేసిన చిరుతపులిలా సంఘవ్యతిరేక శక్తులను చీల్చిచెండాడుతూంటాడు. అయితే చివరకు అతనికో నిజం తెలుస్తుంది.

అది ప్రధానమంత్రి కూడా ఆ విలన్స్ తో చేతులు కలిపాడని. అంతే ఆయనకు ఎదురుతిర్గుతాడు. అక్కడనుండి హోరో హీరీ పోరాటం జరిగి గెలిచి అందరి మన్ననలూ పొందుతాడు. ఇక హీరోయిన్ కూడా పోలీస్ డిపార్టెమెంట్ లోనే ఉంటుంది. ఎప్పుడూ ఇంట్రావర్ట్ గా ఉండే అతన్ని సరదాగా ఉండే మనిషిని చేసి కర్తవ్యోన్ముఖురాలిని చేస్తుంది. అలాగే హీరోకి చిన్నప్పుడు వచ్చి ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా ఆర్ద్రంగా ఉంటుందని తెలుస్తోంది. మరి అదీ కథ.ఇది కరెక్టే అవటానికి ఎంత అవకాశం ఉందో కాకపోవటానికి కూడా అంతే అవకాశముంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X