»   » షాకింగ్: 'సుబ్రమణ్యం ఫర్ సేల్' బడ్జెట్ అంతేనా?

షాకింగ్: 'సుబ్రమణ్యం ఫర్ సేల్' బడ్జెట్ అంతేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆ మధ్యన ...'పిల్లా నువ్వు లేని జీవితం' అంటూ పలకరించిన ...సాయి ధరమ్ తేజ్ చేస్తున్న మూడవ సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్ ‘. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నిన్న గురువారం నాడు రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం బడ్జెట్ గురించి విన్నవారు ఇప్పుడు నోరు వెళ్లపెడుతున్నారు. ఈ చిత్రానికి నిర్మాత దిల్ రాజు చాలా జాగ్రత్తగా ఆచి,తూచి అడుగులు వేసాడంటున్నారు. దర్శకుడు, హీరో, ఇతర నటీనుటుల అందరినీ రెమ్యునేషన్స్ తగ్గించుకోమని, డిస్కౌంట్ లు అడిగి మరీ సినిమా చేసాడంటున్నారు.

 Subramanyam for Sale: Budget details

ట్రేడ్ లో చెప్పుకునేదాన్ని బట్టి ఈ చిత్రానికి దిల్ రాజు ఖర్చు పెట్టింది కేవలం ..ఏడు కోట్లు మాత్రమే అని తెలుస్తోంది. అందులో హరీష్ శంకర్ కు ఇచ్చిన రెమ్యునేషన్ కేవలం 70 లక్షలే అంటున్నారు. అలాగే..అమెరికా షెడ్యూల్ లో...40 రోజులుకు గానూ 2.5 కోట్లు అయ్యిందని తెలుస్తోంది. హరీష్ శంకర్ ఈ సినిమాను లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కించటానికి అహర్నిశలు కష్టపడ్డాడని చెప్పుకుంటున్నారు. హరీష్ శంకర్, హీరో సాయి ధరమ్ తేజ సహకరించబట్టే ఇది సాధ్యం అయ్యిందని చెప్తున్నారు.

English summary
Dil Raju's latest production 'Subramanyam For Sale' made on a tiny budget of Rs 7 crores, which includes all remunerations and publicity expenditure.
Please Wait while comments are loading...