»   » పవన్ వాడిన బైక్ ని 8 లక్షలు చెల్లించి తీసుకున్న హీరో

పవన్ వాడిన బైక్ ని 8 లక్షలు చెల్లించి తీసుకున్న హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు: గతంలో ప్రభాస్ హిట్ మూవీ మిర్చిని మాణిక్య పేరుతో కన్నడలో రీమేక్ చేసి, సూపర్ హిట్ ను అందుకున్న సుదీప్.. ఆ తర్వాత పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ అత్తారింటికి దారేది చిత్రాన్ని రన్న పేరుతో రీమేక్ చేసి మరో భారీ విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా సుదీప్ కు మరో పవన్ కళ్యాణ్ సినిమా పై మనసు పడి రీమేక్ చేస్తున్నాడు.

క్రితం సంవత్సరం సంక్రాంతికి వచ్చిన గోపాల-గోపాల సినిమాపై మనసుపడ్డాడట సుదీప్. పవన్-వెంకటేశ్ కలసి నటించిన ఈ మల్టీస్టారర్ ను కన్నడలో రీమేక్ చేస్తున్నాడు. పవన్ పోషించిన పాత్ర‌లో నటించేందుకు సుదీప్ ఆసక్తి చూపిస్తుండగా, వెంక‌టేష్ పోషించిన భక్తుడి పాత్ర‌ కోసం ఉపేంద్రను సంప్రదించి ఓకే చేయించుకుని షూటింగ్ మొదలెట్టారు.

ముకుందా..ముకుందా టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్...ఓ బైక్ ని వాడారు. సినిమాలో ఎక్కువ భాగం ఆయన ఆ బైక్ పైనే కనపడతారు. ఇప్పుడు అదే బైక్ ని సుదీప్ వాడుతున్నారు. అంతే కాదు బైక్ తో సీన్స్ కూడా షూట్ చేసేసారు.

Sudeep Paid 8 Lakhs To Use Pawan's Bike

ఇక ఈ బైక్ కోసం ఎనిమిది లక్షలు దాకా ఖచ్చు పెట్టినట్లు చెప్పుకుంటున్నారు. పవన్ ఇక్కడ వాడిన బైక్ నే తీసుకుని వెళ్లినట్లు సమాచారం. ఇక ఒకప్పటి హీరోయిన్ ప్రేమను...ఉపేంద్రకు భార్యగా తీసుకోనున్నారు. తెలుగులో శ్రియ ఆ పాత్రను పోషించింది.

ఈగ, బాహుబలి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే చేరువయ్యాడు కన్నడ స్టార్ హీరో సుదీప్. కన్నడంలో స్టార్ హీరో స్టాటస్ అనుభవిస్తున్న సుదీప్ మిగతా సౌత్ భాషల్లోనూ నటిస్తున్నాడు. అలాగే తెలుగు సినిమాల్లో నటించడమే కాదు, పలు తెలుగు సినిమాలను కన్నడలో రీమేక్స్ చేస్తున్నాడు.

English summary
Sudeep is playing the role of Lord Krishna which was played by Pawan Kalyan in telugu film Gopala Gopala remake"Mukunda Murari".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu