Sujeeth: పవన్ కళ్యాణ్ కంటే ముందుగా.. ఆ మెగా హీరోని లైన్ లో పెట్టిన సుజిత్! కానీ,
ప్రస్తుతం ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ 'ఓజీ'మేనియా నడుస్తోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా విడుదలైంది. ఈ పవర్ పుల్ సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తుంది. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించిన ఓజీ సినిమాకు ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వస్తుండటంతో మెగా ఫ్యాన్స్ లో పండుగ వాతావరణం క్రియేట్ అయింది. ఈ యాక్షన్ మూవీకి పవన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచేలా కనిపిస్తోంది. అయితే.. యంగ్ డైరెక్టర్ సుజీత్.. పవన్ కళ్యాణ్ కంటే మరో మెగా హీరోతో సినిమా తీయాలని భావించారట. ఇంతకీ ఆ మెగా హీరో ఎవరు? ఆ స్టోరీ ఏంటీ?
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) ఓజీ సినిమా సక్సెస్ తో ఇండస్ట్రీలో హాట్ టాఫిక్ గా మారారు. కేవలం 23 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు సుజీత్. శర్వానంద్ హీరోగా నటించిన రన్ రాజా రన్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నారు. ఇలా తొలి సినిమా సక్సెస్ తో ఆయనకు ప్రభాస్‌తో భారీ స్థాయి ప్రాజెక్ట్ చేసే అవకాశం దక్కింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన సాహో (Saaho)భారీ విజయం అందుకుంది. ఇండస్ట్రీలో నయా రికార్డు క్రియేట్ చేసింది.

ఆ తర్వాత తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే అవకాశం కొట్టేశారు. అలా ఓజీ (OG) సినిమాను తెరకెక్కించారు. కట్ చేస్తే.. పవన్ కళ్యాణ్ యాక్షన్ ఎంటర్టైనర్ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. ఇండస్ట్రీలో నయా రికార్డులను క్రియేట్ చేస్తుంది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు ఏకంగా 144 కోట్లు వసూలు చేసింది. పవర్ స్టార్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా మారింది. దీంతో పవర్ స్టార్ అభిమానుల ఆనందానికి అంతులేకుండా పోయింది.
ఇక ఓజీ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో సక్సెస్ మీట్స్, పలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు మూవీ మేకర్స్. ఇలా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటున్న సుజీత్ తాజాగా ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ప్రభాస్ సాహో తర్వాత ఆయన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. యూకే బ్యాక్‌డ్రాప్‌లో సినిమా కథ సిద్ధం చేసి, చరణ్ గారికి నేరేట్ చేయాలనుకున్నానని, అయితే ఆ సమయంలో కరోనా రావడంతో ప్రాజెక్ట్ ముందుకు కదలలేదని చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "సుజీత్ - రామ్ చరణ్ కాంబినేషన్ సినిమా జరిగి ఉంటే మరో బ్లాక్‌బస్టర్ వచ్చేది" అని మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది (Peddi) సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ ప్రాజెక్ట్ మొదలుకానుంది. ఇక సుజీత్ తాజాగా తన సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్‌ను ప్రకటించడంతో, అందులో ఏ ఏ హీరోలు భాగం కానున్నారనే కుతూహలం సినీ వర్గాల్లో పెరుగుతోంది.


Click it and Unblock the Notifications











