»   » దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఆ స్టార్ డైరక్టర్..?

దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఆ స్టార్ డైరక్టర్..?

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Sukumar direct Music Director Devi Sri prasad?
  హైదరాబాద్ : కంటిన్యూ హిట్స్ తో మ్యూజిక్ డైరక్టర్ గా ఒక వెలుగు వెలిగున్న తెలుగు మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్. స్టేజీపై అతను ఉషారుగా చేసే డాన్స్ లు అవీ చూసి అతని హీరోగా చేయాలని నిర్మాతలు, దర్శకులు చాలా మంది ఉత్సాహం చూపించారు. అయితే అతను పూర్తిగా హీరో అవుదామనే దృష్టి పెట్టాడని సినీ వర్గాల సమాచారం. అయితే ఈ చిత్రాన్ని ఎవరు డైరక్ట్ చేస్తారు అంటే సుకుమార్ చేసే అవకాసం ఉందని వార్తలు వినపడుతున్నాయి. అయితే ఇది రూమరా లేక నిజంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనేది తేలాల్సి ఉంది.

  ఇక యూత్ సబ్జెక్ట్స్ ని డీల్ చేయటంలో సుకుమార్ ది అందె వేసిన చేయి. దానికి తోడు దేవికి,సుకుమార్ కు మధ్య మంచి రిలేషన్ ఉంది. సుకుమార్ సినిమాలన్నిటికి దేవినే మ్యూజిక్ డైరక్టర్. కెరీర్ మొదటి నుంచి దేవి తో సుకుమార్ ప్రయాణం సాగుతోంది. దాంతో సుకుమార్ పూనుకుని దేవిని హీరో చేద్దామని ఫిక్స్ అయ్యాడని ఫిల్మ్ నగర్ టాక్. ఈ నేపధ్యంలో తెలుగు,తమిళ భాషల్లో పేరొందిన ఓ నిర్మాత అతనితో సినిమా చేయటానికి ఆసక్తి చూపుతున్నాడని వార్త.

  అలాగే తన మొదటి సినిమా ఓ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా ఉండాలని దేవి బావిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ఎమ్.ఎస్.రాజు ఆ ధైర్యం చేద్దామని ఊగారు కాని తన కొడుకునే సీన్ లోకి తేవాల్సిన అవసరం రావటంతో సైలెంట్ అయ్యిపోయారు. ఇక దేవి కూడా ఈ సారి హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ఆసక్తిగా ఉన్నట్లు చెప్తున్నారు.

  గతంలో దేవి మీడియాతో మాట్లాడుతూ... నేను హీరోగా నటిస్తాననీ వార్తలు వస్తూనే ఉన్నాయి. చేయాలని ఉంది. కానీ కథ నచ్చాలి. అది నన్ను వెంటాడాలి. అలాంటప్పుడు నటించడానికేం అభ్యంతరం లేదు అంటున్నారు ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్. ఆయన మీడియాతో మాట్లాడుతూ...తను సినిమా చేయాలంటే వేసుకోవాల్సిన వర్కింగ్ ప్లాన్ చెప్పుకొచ్చారు. ఆయన మాటల్లోనే...నటించాలని నాకు నాలుగు నెలలు ముందుగా చెబితే మిగిలిన సంగీత పనులను పూర్తి చేసుకుని నటనకు సమయాన్ని కేటాయించడానికి వీలుంటుంది. ప్రస్తుతానికి నేను నా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాను అన్నారు.

  English summary
  Many producers approached Devi with lead roles and he refused all as he was busy with his composing albums and having no time to take extra burden. But finally Devi gave his nod to accept the new role and we are going to see him in onscreen as a hero. Buzz is that devi is going to act under Sukumar direction for his debut film and it will be a youthful musical love story .Sukumar is a close buddy of DSP as all his movies equipped with Devi music.All these dats we all witnessed Devi energy levels and his extraordinary dancing skills on the stages and this time we are going to judge about the acting skills of the music gun.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more