»   » లీక్: సుకుమార్ రాసిన 'కుమారి 21ఎఫ్‌' కథ ఇదే?

లీక్: సుకుమార్ రాసిన 'కుమారి 21ఎఫ్‌' కథ ఇదే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :రాజ్‌ తరుణ్‌, హెబ్బా పటేల్‌ జంటగా నటించిన చిత్రం 'కుమారి 21ఎఫ్‌'. ఈ చిత్రం కథని సుకుమార్ రాసి నిర్మిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి ఓ రేంజిలో క్రేజ్ వచ్చింది. ఈ చిత్రం కథ ఏమై ఉంటుందంటూ అందరూ రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. మరో ప్రక్క నవంబర్‌ 20న 'కుమారి 21ఎఫ్‌' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ లైక్ అయ్యిందంటూ ఒక కథ ప్రచారంలోకి వచ్చింది. ఆ కథను మీకు ఇక్కడ అందిస్తున్నాం. చదవండి..నిజమో కాదో రేపు ధియోటర్ లో చూసి డిసైడ్ చేసుకోండి.

చెప్పుకుంటున్న కథ ప్రకారం... హీరో రాజ్ తరుణ్ , హెబ్బా ఇద్దరూ ప్రేమికులు. ఇద్దరూ లవర్స్ గా వాల్యుబల్ టైమ్ ని ఎంజాయ్ చేస్తారు. అయితే హెబ్బా తొలినుంచీ మగ, ఆడా అనే తేడా లేకుండా...ఫ్రెండ్స్ అందరితో సోషల్ గా ఉంటూ చాలా క్లోజ్ గా మూవ్ అవుతూంటుంది. దాంతో ఆమెపై రాజ్ తరుణ్ కు డౌట్ వస్తుంది. తనతో కాకుండా ఆమె వేరే వారితో లవ్ ఎఫైర్ నడుపుతోందేమో అని అనుమానిస్తాడు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


Sukumar's Kumari 21F leaked story

తనకు వచ్చిన ఈ అనుమానం నిజమో కాదో తేల్చుకోవటానికి తన ఫ్రెండ్స్ తో కలిసి ఆమెకు తెలియకుండా టెస్ట్ లు పెడతాడు. అవన్నీ ఫన్నీగా సాగుతాయి. అయితే ఓ రోజు ఈ విషయం హెబ్బాకు తెలిసిపోతుంది. ఆమె కూడా ఈ టెస్ట్ లతో ఓ సమస్యలో ఇరుక్కుంటుంది. ఆ క్రమంలో ఆమె ఎంత నిజాయితీ పరురాలో రాజ్ కు అర్దం అవుతుంది.


కానీ అప్పటికే ఆమె రాజ్ తో అనుమానం బోయ్ ఫ్రెండ్ తో గడపటం కష్టమని తేల్చి చెప్పి వెల్లిపోతుంది. ఆ క్రమంలో రాజ్ తరుణ్ తిరిగి ఆమెను వెనక్కి తేవటానికి ఏం చేసాడు అనేది మిగతా కథ. అయితే ఇది కేవలం ఫిల్మ్ సర్కిల్స్ లో, మీడియాలో ప్రచారంలో ఉన్న కథ మాత్రమే అని గమనించండి.


రాజ్‌తరుణ్, హేభ పటేల్, నోయల్, నవీన్, సుదర్శన్ రెడ్డి, భాను, హేమ, కమల్, తాగుబోతు రమేష్, జోగిబ్రదర్స్, సత్య, కౄఎష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రత్నవేలు, ఆర్ట్: బి.రామచంద్రసింగ్, ఎడిటర్: అమర్ రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, శంకర్, నిక్సన్, సమర్పణ: సుకుమార్, నిర్మాతలు: విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి,కథ,స్కీన్‌ప్లే-మాటలు: సుకుమార్, దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్.

English summary
Here is the leaked story of Kumari 21F. Under "Sukumar Writings" banner, this film is made for which Devi Sri Prasad has scored music. Surya Pratap who has carved our Sushant's "Current" is directing this movie. For now, the release date of the film is confirmed as November 20th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu