»   » చిరు 'ఖైదీ నంబర్‌ 150' ...సీన్ లోకి సుకుమార్ అసెస్టెంట్

చిరు 'ఖైదీ నంబర్‌ 150' ...సీన్ లోకి సుకుమార్ అసెస్టెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో 'ఖైదీ నంబర్‌ 150' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి రోజుకో వార్త అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఈ చిత్రం గురించి మరో వార్త మీడియాలో చర్చనీయాంశమైంది. ఆ వార్త ఏమిటీ అంటే... ఈ చిత్రానికి దర్శకుడు సుకుమార్ దగ్గర పనిచేసి, ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో చిత్రానికి కథ ఇచ్చి, మీకు మీరే...మాకు మామే చిత్రం డైరక్ట్ చేసిన హుస్సేన్ షా ని సీన్ లోకి తెచ్చారు.

హటాత్తుగా హుస్సేన్ షా సీన్ లోకి రప్పించటానికి కారణం...సినిమాలో అలీ, సునీల్, బ్రహ్మానందం పై కామెడీ ట్రాక్ ని రాయంచటానికే అని తెలుస్తోంది. ఈ సినిమా మెయిన్ కథ పూర్తిగా సీరియస్ గా నడుస్తూండటంతో కామెడీ ట్రాక్ పై ఎక్కువ కాన్సర్టేట్ చేస్తున్నట్లు సమాచారం. కథలో కలిసేలా, ప్లాట్ ని ఎక్కడా డీవియేట్ కాకుండా ఈ కామెడీ ట్రాక్ ని తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే... ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ , ఆకుల శివ , సాయి మాధవ్ బుర్రా రచయితలుగా పనిచేస్తున్నారు.


Sukumar’s Protege for Khaidi No 150

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చకచకా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ముందుగానే చెప్పేశారు. అందువలన ఆ సమయానికి అన్నిపనులు పూర్తయ్యేలా చూసుకునేలా పనిలో పడ్డారు. ఇప్పటివరకు పలు సన్నివేశాలు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం తాజాగా కాజల్‌తో కలిసి రొమాన్స్ సీన్స్‌లో చిరు బిజీ బిజీ ఉన్నాడట. చాలా రోజులు అయినప్పటికీ అటు నటనలో, ఇటు రొమాన్స్‌లో ఎలాంటి మార్పులు లేకుండా చేస్తున్నట్టు చెప్తున్నారు చిత్ర యూనిట్. మొత్తానికి వీలైనంత తొందరగా సినిమా పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చెయ్యడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.


రాజకీయాల తర్వాత చిరంజీవి రీఎంట్రీపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. వాటిని అధిగమిస్తూ తమిళంలో ఘన విజయం సాధించిన 'కత్తి' చిత్రాన్ని తెలుగులో 'ఖైదీ నంబర్‌ 150'గా రీమేక్‌ చేస్తున్నారు. చిరంజీవి నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయని నిర్మాత రామ్‌చరణ్‌ చెబుతున్నారు. ఇప్పటి వరకు చిరంజీవి నటించిన చిత్రాలు ఒక ఎత్తు అయితే ఇది మరో ఎత్తుగా అభివర్ణించాల్సిందే. ఎందుకంటే దాదాపు 9 సంవత్సరాల తర్వాత చిరంజీవి కెమెరా ముందుకు వచ్చారు. అయితే ఆయన నటనలో ఎలాంటి మార్పు లేదని చిత్ర బృందం చెబుతోంది.

English summary
Hussain worked as a script assistant for Sukumar’s film has been roped in to write the dialogue version for the episodes involving Ali, Sunil and Brahmanandam in Khaidi No 150 movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu