»   » ‘సుప్రీమ్‌’ అనీల్ రావిపూడి తదుపరి చిత్రం ఆ హీరోతో?

‘సుప్రీమ్‌’ అనీల్ రావిపూడి తదుపరి చిత్రం ఆ హీరోతో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కళ్యాణ్ రామ్ తో చేసిన తొలి సినిమా 'పటాస్‌'తోనే అందరినీ ఆకట్టుకొన్నాడు అనిల్‌రావిపూడి. తర్వాత సాయి ధరమ్ తేజ తో చేసిన ఇప్పుడు 'సుప్రీమ్‌' కూడా హిట్ అనిపించుకొంది. అంతేకాదు ఈ రెండు సినిమాలతో కమర్షియల్‌ కథల్ని తెరపైకి సమర్దవంతంగా తీసుకువచ్చి హిట్ కొట్టగలడనే పేరు సైతం వ్చచింది.

దాంతో టాలీవుడ్ హీరోలందరి దృష్టి ఈ యంగ్ డైరక్టర్ పై పడింది. అందుతున్న సమాచారం ప్రకారం తాజాగా రవితేజ కూడా అనిల్‌కి ఓ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. సుప్రీమ్ హిట్టయ్యాక పోన్ చేసి.... 'మంచి కథ ఉంటే చెప్పు.. కలసి చేద్దాం' అని అన్నారు.

Supreme director is planning to team up with Ravi Teja for next venture

దాంతో ప్రస్తుతం అనిల్‌రావిపూడి ఇప్పుడు రవితేజ కోసం కథ వండే ప్రయత్నంలో ఉన్నాడని వినికిడి. మరో ప్రక్క రవితేజ ప్రస్తుతం చక్రి అనే నూతన దర్శకుడితో కలసి ఓ ప్రాజెక్టు పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఆ తరవాత అనిల్‌ సినిమా ఉండొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Supreme director is planning to team up with Ravi Teja for next venture

అనిల్‌ కూడా స్టార్ హీరోలపై దృష్టి పెట్టాడు. నందమూరి బాలకృష్ణ కోసం ఓ కథ సిద్ధం చేశాడని తెలుస్తోంది. 'బాలయ్యగారితో ఓ సినిమా తప్పకుండా ఉంటుంది. అయితే అదెప్పుడన్నది చెప్పలేను' అంటున్నాడు అనిల్‌ రావిపూడి.

English summary
Director Anil Ravipudi is planing to do a film with Ravi Teja for that he planning to team up.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu