మరోసారి నిర్ణయం మార్చుకున్న నారప్ప టీమ్.. అలానే రిలీజ్ చేయాలని ప్లాన్..?
కరోనా లాక్ డౌన్ ఎత్తి వేసినా కూడా సినిమా ఇండస్ట్రీలో కష్టాలు ఇంకా తీరలేదు. థియేటర్స్ ఓపెన్ చేస్తే సినిమాలు రిలీజ్ చేయడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు. పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇక డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్లు సినిమాలను ఓటీటీలో విడుదల చేయవద్దని ఆవేదనం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇటీవల నారప్ప సినిమాను ఆమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాలని అనుకున్న విషయం తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు అలాంటి నిర్ణయం తీసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. పెట్టిన పెట్టుబడికి ఎంతో కొంత లాభం దక్కుతుందని కూడా అనుకున్నారు. అయితే ఇటీవల మళ్ళీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. థియేటర్స్ ఓపెన్ చేసిన తరువాతే సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారని టాక్ వస్తోంది.

నిర్మాత సురేష్ బాబు ఆమెజాన్ ప్రైమ్ కు ఇచ్చిన మాటను కూడా వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా దృశ్యం సినిమాను కూడా థియేట్రికల్ గానే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ లో విరాటపర్వం కూడా తెరకెక్కుతోంది. ఆ సినిమాకు కూడా ఓటీటీ ఆఫర్స్ చాలానే వచ్చాయి. కానీ సురేష్ బాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మరి థియేటర్స్ ఓపెన్ చేసిన తరువాత పరిస్థితులు ఎంతవరకు అనుకూలిస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications











