Just In
- 20 min ago
మనం 2లో మరో ఇద్దరు యువ హీరోలు.. స్టోరీ ఎంతవరకు వచ్చిందంటే?
- 29 min ago
విడుదలకు ముందే బయటకు: ‘ఆచార్య’ టీజర్ హైలైట్స్ ఇవే.. చివరి ఐదు సెకెన్స్ అరాచకమే!
- 1 hr ago
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ డేట్ ప్రకటన: అదిరిపోయిన కొత్త పోస్టర్.. ఆ రూమర్లకు కూడా చెక్
- 1 hr ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
Don't Miss!
- News
మదనపల్లె కేసు రిమాండ్ రిపోర్ట్ లో షాకింగ్ అంశాలు .. పూజ గదిలో బూడిద, కత్తిరించిన జుట్టు, గాజు ముక్కలు
- Sports
టీమిండియా ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది.. ఓడించడం కష్టమే: ఇంగ్లండ్ మాజీ కోచ్
- Automobiles
ఇండియా To సింగపూర్ : బస్లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి
- Finance
Gold prices today: వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం ధరలు, రూ.7500 తక్కువ
- Lifestyle
తక్కువ సమయంలో చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే ముందు ఇది తెలుసుకోవాలి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'ఎన్టీఆర్ మహానాయకుడు'.. పోటీగా మరో చిత్రం!

బాలయ్య నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. బాలయ్య ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడుగా రెండు భాగాలుగా విడుదల కానుంది. తక్కవ గ్యాప్ లోనే ఈ రెండు చిత్రాలని విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ మహానాయకుడు విడుదల విషయంలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

తీవ్రమైన పోటీ
ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. సంక్రాంతికి భారీ పోటీ నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ పెట్ట చిత్రం జనవరి 10న విడుదల కానుంది. ఇక మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న విజయ విధేయరామ చిత్రం జనవరి 11 న విడుదల కానుంది. 12న వెంకీ, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

ఎన్టీఆర్ మహానాయకుడుకి కూడా
ఇక ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబందించిన విశేషాలన్నీ ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో చూపించబోతున్నారు. ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 24 న ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పుడు ఈ చిత్రానికికూడా పోటీ ఎదురవుతోంది. తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ఎన్ జికె చిత్రాన్ని జనవరి 26న విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వాయిదా పడుతుందా
మరోవైపు మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు మధ్య గ్యాప్ తక్కువగా ఉండడంతో బయ్యర్లు చిత్ర యూనిట్ పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. మహాయకుడు చిత్రాన్ని ఫిబ్రవరికి వాయిదా వేయాలనే డిమాండ్ పెరుగుతోందట.

స్టార్ల సందడి
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం స్టార్ల సందడితో కనుల పండుగ కానుంది. రానా, సుమంత్, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యామీనన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో 66 గెటప్స్ లో కనిపిస్తాడని సమాచారం. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు.