»   » మహేష్ సినిమాని మళ్లీ తన్నుకుపోయాడు

మహేష్ సినిమాని మళ్లీ తన్నుకుపోయాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : స్టార్ దర్శకులంతా మహేష్ తో చిత్రం చేయాలని కలలు కంటూ కథలు రెడీ చేసుకుని ఆయన చుట్టూ తిరుగుతున్నారు. అయితే మహేష్ ఆచితూచి అడుగులు వేస్తూ ఆ దర్శకులుకు వెయిటింగ్ లో పెడుతున్నారు. దాంతో ఆ దర్శకులు మహేష్ కోసం మక్కువతో చేసుకున్న కథలతో వేరే హీరోల డేట్స్ పడుతున్నారు. ఆ మధ్య అంజాన్ కథని మహేష్ కి చెప్పి, ఆయన డేట్స్ కోసం తిరిగి చివరకు దాన్ని సూర్య తో చేసారు. ఇప్పుడు మళ్లీ అలాంటిదే మరొకటి జరిగిందని తెలుస్తోంది.

మనం చిత్రంతో హిట్ కొట్టిన విక్రమ్ కుమార్ ...తన తదుపరి చిత్రం మహేష్ తో చేయాలని అనుకున్నారు. ఆ మేరకు ఆయన కథ సిద్దం చేసుకుని మహేష్ ని సంప్రదించారు. అయితే అప్పటికే మహేష్ డైరీ ఫుల్ బిజీగా ఉండటంతో ఈ విషయంపై ఏ నిర్ణయం తీసుకోలేదు. దాంతో ఈ విషయం తెలుసుకున్న సూర్య ...ఈ చిత్రం తాను చేస్తానని వెంటనే విక్రమ్ కుమార్ ని సంప్రదించాడని సమాచారం. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు కోలివుడ్ సమాచారం.

Surya get Mahesh Babu's Movie

గతంలో విక్రమ్ కుమార్...తన 13 బి చిత్రం కోసం సూర్యని సంప్రదించారు. అయితే అప్పట్లో అది మెటీరియలైజ్ కాక మాధవన్ తో ముందుకి వెళ్లారు. ఇప్పుడు తనను పిలిచి అవకాసం ఇవ్వటంతో వెంటనే ఓకే చేసినట్లు సమాచారం. ఈ కథతో తెలుగు,తమిళంలో ఒకే సారి చేయాలని సూర్య ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కథనే పూర్తిగా నమ్ముకుని ముందుకు వెళ్తున్న ఈ దర్శకుడు ఈ సినిమా కూడా సూపర్ హిట్ చేసే అవకాసం ఉంది.

English summary
Surya came to know that Vikram Kumar has told a concept to Mahesh Babu who was impressed by it. Then Surya called upon Vikram Kumar and asked about the story idea he has in mind for Mahesh Babu and ok it.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu