»   »  తమన్నా తగ్గించిందా...నిజమేనా?

తమన్నా తగ్గించిందా...నిజమేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : హీరోయిన్స్ రెమ్యునేషన్స్ ఎప్పుడూ వార్తల్లో ఉండే విషయాలే. ఒక సినిమా హిట్ అవగానే వాళ్లు రెమ్యునేషన్ పెంచుతారోలేదో కానీ మీడియాలో మాత్రం రెమ్యునేషన్ పెంచిందని వార్తలు గుప్పుమంటాయి. తాజాగ అలాంటిదే తమన్నాకు అనుభవమైంది. అయితే ఆమె విషయంలో రివర్స్ లో జరిగింది. ఆమె రెమ్యునేషన్ తగ్గించనే వార్త బయిలు దేరింది. దాంతో ఆమె కంగారుపడి ..అదేం లేదని వివరణ ఇచ్చేసింది.

ప్రస్తుతం బాహుబలి (ది కన్ క్లూజన్ ) కోసం కసరత్తులు చేస్తున్న తమన్నా తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉంది. ఈ అమ్మడు పిజ్జా ఫేమ్ విజయే సేతుపతి తో తమళ సినిమాకు సైన్ చేసింది. రవితేజా సరసన బెంగాల్ టైగర్ తో నటించి మంచి హిట్ తో ఫామ్ లో కొచ్చిందీ ఈ హీరోయిన్.

Tamanna not cut down her remuneration

అదే కోవలో తమిళంలోనూ ఫామ్ లోకి రావాలని ఈ ప్రాజెక్టు ఒప్పుకుందని అందుకోసం రెమ్యునేషన్ తగ్గించిందని అంటున్నారు. కేవలం ఆఫర్ పట్టుకోవటానికే ఆమె తగ్గించి కమిటైందని టాక్.ఇది కేవలం మరిన్ని ఆఫర్స్ రావడానికి ఉపయేగపడుతుందని ఆశిస్తున్నట్టు కోలివుడ్ లో చెప్పుకుంటున్నారు.
కాకపోతే అందరూ రెమ్యునేషన్ తగ్గించి తనను సంప్రదిస్తూండటంతో కంగారు పడ్డ తమన్నా... తనకున్న పరిదిలో, రెమ్యునరేషన్ విషయంలో వస్తున్న రూమర్స్ ను పట్టించుకోవద్దని, తను అలాంటి నిర్ణయం తీసుకోలేదని చేపుతున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి ఇంకా తనకు డిమాండ్ వుందని, తన రరెమ్యునరేషన్ తగ్గించుకునే అవకాశం లేదని చేప్పినట్టు మరో వార్త రన్ అవుతోంది. ఏది నిజమో..ఏది అబద్దమో..తమన్నా ట్విట్టర్ సాక్షిగా ప్రకటన చేస్తే కానీ తేలేటట్లు లేదు.

English summary
Rumours in Tamil media said that...Tamannah has cut down her remuneration to bag more offers in Kollywood.
Please Wait while comments are loading...