విజయ్ సేతుపతి ప్లేస్ లో తమన్నా.. భారీ రెమ్యునరేషన్ సహా.. ఎక్కడా తగ్గట్లేదుగా!

తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన తమన్నా భాటియాకి ఇప్పుడు క్రేజ్ తగ్గింది. కొత్త భామల ఎంట్రీ సహా సరయిన హిట్ సినిమాలు లేకపోవడం లాంటి అనేక అంశాలతో ఈ భామ వెనకపడింది. అయితే ఈ భామకు ఒక క్రేజీ ఆఫర్ లభించిందని అంటున్నారు. ఏకంగా విజయ్ సేతుపతి ప్లేస్ లో ఆమె మంచి ఆఫర్ లభించిందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

తెలుగులోనే క్రేజ్

తెలుగులోనే క్రేజ్

హిందీ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే క్రేజ్ తెచ్చుకుంది. తెలుగు తరువాత ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించిన తమన్నా నటిగా తన ప్రస్థానం 2005లో హిందీలో చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాతో మొదలుపెట్టింది. అదే ఏడాది శ్రీ సినిమాతో తెలుగులో, ఆ తదుపరి ఏడాది కేడీ సినిమాతో తమిళంలో అడుగు పెట్టింది. ఇక పెట్టిన తమన్నా దాదాపు 40 సినిమాల్లో నటించింది.

హ్యాపీ డేస్ తో బ్రేక్

హ్యాపీ డేస్ తో బ్రేక్

ఇక 2007లో తెలుగులో శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీ డేస్ సినిమాలో తమన్నా మధు అనే కాలేజ్ విద్యార్థినిగా నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అందుకోవడంతో పాటు తమన్నాకి నటిగా మంచి గుర్తింపును తెచ్చింది. ఇక ఆ తరువాత ఆమె వెనక్కు తిరిగి చూసుకోవలసిన పని పడలేదు. రెడీ, 100 % లవ్, ఊసరవెల్లి, కెమెరామెన్ గంగతో రాంబాబు, రచ్చ, బాహుబాలి లాంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది.

డిజిటల్ ఎంట్రీ

డిజిటల్ ఎంట్రీ

ఇక ఈ మధ్య కాలంలో ఎందుకో కానీ ఆమె క్రేజ్ తగ్గింది. తెలుగులో చివరిగా నానువ్వే అనే సినిమాలో నటించిన తమన్నా ఇప్పుడు ఒక్క తెలుగు సినిమాలో మాత్రమే నటిస్తోంది. గోపీ చంద్ హీరోగా నటిస్తున్న సీటీమార్ సినిమాలో ఆమె జ్వాలా రెడ్డి అనే పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె ఒక కబాడీ టీచర్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా మీద అనేక ఆశలు పెట్టుకుంది. ఆమె ఈ మధ్యనే డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చింది. లెవెంత్ హావర్ అనే తెలుగు సిరీస్ ఆహాలో స్ట్రీమ్ కాగా నవంబర్ స్టోరీస్ అనే మరో సిరీస్ డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది.

ఆ పాపులర్ టీవీషోకి హోస్ట్ గా

ఆ పాపులర్ టీవీషోకి హోస్ట్ గా

ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు తమన్నాకి ఒక బంపర్ ఆఫర్ తగిలినట్టు చెబుతున్నారు. ఆమె టీవీ షోకి హోస్ట్ గా వ్యవహరించే అవకశం ఉందని అంటున్నారు. మాస్టర్ షెఫ్ పేరుతొ తెలుగులో ప్రారంభం కానున్న ఒక కుకింగ్ షోకి ఆమె హోస్ట్ గా వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే మంచి రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో ఆమె సైన్ కూడా చేసిందని అంటున్నారు. ఇది హిందీలో ఒక పాపులర్ షో అని, ఇప్పటికే కొన్ని సీజన్స్ టెలీకాస్ట్ అయి సూపర్ హిట్ అయ్యాయని అంటున్నారు.

Recommended Video

Ananya Nagallla Is The New Super Star Says Play Back Director | Filmibeat Telugu
టీవీనే బెటర్

టీవీనే బెటర్

అయితే ఇదే షోని తమిళంలో విజయ్ సేతుపతి హోస్ట్ చేస్తున్నారని అంటున్నారు. అలా అక్కడ ఆయన హోస్ట్ చేస్తుండగా ఇక్కడ తెలుగులో మాత్రం తమన్నా ఆయన ప్లేస్ తీసుకుంటోంది అన్న మాట. సినిమా కంటే టీవీ షోల ద్వారా తన ఫ్యాన్స్ తో ఎక్కువ కనెక్ట్ అవ్వచ్చని ఆమె భావిస్తుందని అంటున్నారు. సినిమాలతో పోలిస్తే మంచి రెమ్యునరేషన్ కూడా లభిస్తోందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X