twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ పరిశ్రమలో విషాదం: హార్ట్ఎటాక్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

    |

    సినీ పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక భాషకు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన విషాద వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా భారత్ లో కరోనా సెకండ్ వేవ్‌ కరోనా వైరస్ రోజురోజుకి తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రతి రోజు దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్ అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు.ఈ సెకండ్ వేవ్ లో కరోనా ప్రభావం సినీ పరిశ్రమపై తీవ్రంగా ఉంది. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు వైరస్‌బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.

    మరి కొందరు ఇతర కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రోజు సాయంత్రం కూడా తమిళ తెలుగు సినిమాలకు ఎడిటర్ గా పనిచేసిన ప్రసాద్ కరోనా కారణంగా మరణించాడనే వార్త వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్త వెలువడిన గంటలలోపే మరో ప్రసిద్ధ తమిళ నటుడు, తమిళ సినిమాల్లో చాలా సినిమాలకు కో-డైరెక్టర్ గా పనిచేసిన పాన్‌రాజ్ మరణించినట్లు తెలుస్తోంది. తమిళ నటుడు పాన్‌రాజ్ గుండెపోటుతో శనివారం చెన్నైలో కన్నుమూశారు.

    Tamil actor Pawnraj passes away

    పాన్‌రాజ్ మరణ వార్తను సినీ దర్శకుడు పొన్‌రామ్‌ ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. పాన్‌రాజ్ 'వరుతపాధ వాలిబార్ సంగం', 'రజిని మురుగన్', 'సీమా రాజా' వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. రజిని మురుగన్ సినిమాలో ముఖ్యంగా మదురైక్కరన్ సీన్ లో ఆయన నటన సినిమా అభిమానులకి గుర్తుండి పోతుంది. పాన్‌రాజ్ మరణ వార్త ఆన్‌లైన్‌లో బయటకు వచ్చిన వెంటనే, చాలా మంది సినీ అభిమానులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. నటుడిగానే కాక పాన్‌రాజ్ దర్శకుడు పొన్‌రామ్‌కు సహాయకుడిగా పనిచేశారు.

    Read more about: ponram
    English summary
    Tamil actor Pawnraj passed away on Saturday in Chennai due to heart attack. The news about Pawnraj’s demise was shared by filmmaker Ponram on Twitter. Pawnraj was best known for his performance in films like Varuthapadadha Vaalibar Sangam, Rajini Murugan and Seema Raja. Besides acting, Pawnraj worked as an assistant to filmmaker Ponram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X