»   » తెలంగాణ ఫిల్మ్ మేకర్స్‌కు కేసీఆర్ మొట్టికాయలు!

తెలంగాణ ఫిల్మ్ మేకర్స్‌కు కేసీఆర్ మొట్టికాయలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలంగాణ తొలి ముఖ్య మంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో తెలంగాణకు చెందిన పలువురు ఫిల్మ్ మేకర్స్ వెళ్లి ఆయన్ను కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసినట్లు సమాచారం. అయితే వారికి కేసీఆర్ నుండి ఊహించని అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది.

ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ లాంటి వారు తనపై విమర్శలు చేస్తుంటే మీరంతా ఎక్కడికి వెళ్లారు? కనీసం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు? అంటూ కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ నుండి ఇలాంటి స్పందన రావడంతో పలువురు ఖంగుతిన్నట్లు సమాచారం.

Telangana filmmakers meet KCR!

అయితే తెలంగాణ ప్రాంతం వారితో పాటు పలువురు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఫిల్మ్ మేకర్స్ కూడా కేసీఆర్ ముఖ్య మంత్రి అయిన తర్వాత వెళ్లి అభినందించారు. అయితే వారిని కేసీఆర్ బాగా రిసీవ్ చేసుకోవడం గమనార్హం. సినీ పరిశ్రమను కాపాడుకుంటామని, అభివృద్ధికి తోప్పడతామని హామీ ఇవ్వడం విశేషం.

తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఎక్కువ భాగం సీమాంధ్రుల ప్రాభల్యమే ఉన్నప్పటికీ...తెలంగాణ ప్రభుత్వం నుండి వారికి తగిన సహాయసహకారాలు అందించి పరిశ్రమ హైదరాబాద్ నుండి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లకుండా కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
Telangana filmmakers who recently went to Telangana CM KCR to wish him on his victory and also apprise him of the industry's problems and need for sops for the film industry received shock from him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu