»   » తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ ఎవరు: ఆయనేనా...

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ ఎవరు: ఆయనేనా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న రియాల్టీ షోలో బిగ్ బాస్ ఎవరనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కనిపించకుండా గంభీరమైన గొంతుతో బిగ్ బాస్ ఆదేశాలు జారీ చేస్తున్నాడు. అయితే, ఆ గొంతు ఎవరిదో తెలుసుకోవడానికి విశ్వప్రయత్నాలే చేస్తున్నారు.

ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షోపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. శని, ఆదివారాల్లో ఎన్టీఆర్ ఎపిసోడ్స్ మాత్రం ఆసక్తికరంగా సాగుతున్నాయి. మిగతా రోజుల్లో అంత ఆసక్తికరమైన విషయాలేమీ ఉండడం లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

తెరపై కనిపించకుండా వెనక నుంచి గంభీరమైన గొంతుతో బిగ్ బాస్ ఆదేశాలు జారీ చేస్తుంటాడు. టాస్క్‌లు ఇవ్వడంతో పాటు తప్పు చేశారంటూ పోటీదారులను మందలిస్తూ ఉంటాడు.

Telugu Bigg Boss identified

బిగ్ బాస్ పేరు మీద గంభీరమైన గొంతుతో మాట్లాడే వ్యక్తి ఎవరో తెలిసిపోయిందని అంటున్నారు. ఆ గొంతు బుల్లితెర డబ్బింగ్ ఆర్టిస్ట్ రాధాకృష్ణది అని తెలిసింది. ఆయన సినిమాల్లో విలన్ పాత్రలకు కూడా డబ్బింగ్ చెప్పినట్టు తెలుస్తోంది.

NTR Attended for Bigg Boss show launching program | Fimibeat Telugu

రాధాకృష్ణతో పాటు మాటీవీలో వచ్చే హిందీ డబ్బింగ్ సీరియళ్లకు డబ్బింగ్ చెప్పే శంకర్ అనే మరో డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా బిగ్‌బాస్ షో కోసం పనిచేస్తున్నట్టు సమాచారం. సీఐడీ తెలుగు వెర్షన్‌కు శంకర్ పనిచేసినట్టు చెబుతున్నారు.

English summary
It is said that TV dubbing artist Radha Krishna is giving orders to the participants of Telugu Bigg Boss reality show s Big Boss.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu