»   » ‘బెంగుళూరు డేస్’తెలుగు రీమేక్ లో వీళ్లే?

‘బెంగుళూరు డేస్’తెలుగు రీమేక్ లో వీళ్లే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రఖ్యాత నిర్మాణ సంస్థ పివిపి సినిమాస్‌, అగ్ర నిర్మాత దిల్‌రాజుతో కలిసి ఓ త్రిభాషా చిత్రానికి సన్నాహాలు చేస్తోంది. మలయాళంలో ఘనవిజయం సాధించిన 

'బెంగుళూరు డేస్' సినిమాని తెలుగు, తమిళ్‌, కన్నడ భాషల్లో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో సిద్దార్ధ,నాగచైత్య, ఆర్య నటించనున్నారని సమాచారం. ఈ మేరకు వారితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మాతృకలో దుల్కార్‌ సల్మాన్‌, పహద్‌ఫాజిల్‌, నివిన్‌. నజ్రియా నజీమ్‌ తదితరులు నటించారు. అంజలి మీనన్‌దర్శకత్వం వహించారు.

Telugu team for'Banglore Days'remake

ఒంగోలు గిత్త చిత్ర పరాజయంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా వుంటున్నారు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. తాజాగా ఆయన తెలుగులో ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. మలయాళంలో పెద్ద విజయాన్ని సాధించిన బెంగళూరు డేస్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఈ చిత్ర తమిళ, తెలుగు రీమేక్ హక్కుల్ని పీవీపీ సినిమా సంస్థ సొంతం చేసుకుందని సమాచారం. మలయాళంలో అంజలిమీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్కడ కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డును సష్టించింది. ఈ చిత్ర తెలుగు రీమేక్‌కు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది.

మరో ప్రక్క ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో ఏక కాలంలో తెరకెక్కించడానికి నిర్మాత పొట్లూరి వి.ప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతుంది. తమిళం, తెలుగు, భాషల్లోను అలాంటి యువ హీరో హీరోయిన్లను నటింప చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ రెండు భాషల్లోనూ వేర్వేరు నటీ నటులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. మరి ఈ హిట్ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకునే హీరో హీరోయిన్లు ఎవరన్నది మరి కొద్దిరోజుల్లో తెలిసిపోతుంది.

English summary
Siddarth, Naga Chaitanya and Arya are going to be in ‘Bangalore Days’ remake lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu