»   »  హాట్ టాపిక్ : ‘బాహుబలి’లో తంగబలి

హాట్ టాపిక్ : ‘బాహుబలి’లో తంగబలి

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : ప్రభాస్, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న 'బాహుబలి' లో తంగబల్లి నటించనున్నాడు. తంగబల్లి అనేది.. చెన్నై ఎక్సప్రెస్ చిత్రంలో విలన్ పాత్ర పేరు. ఆ పాత్ర వేసిన నిఖిటిన్ ధీర్ ...ని ఈ చిత్రానికి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. బాహుబలిలో కీలక పాత్ర చేస్తున్న సత్యరాజ్ రికమెండేషన్ మీద ఓ కీలకమైన పాత్రను అతన్ని ఎంపిక చేసినట్లు చెప్పుకుంటున్నారు. నిన్నటి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రం షూటింగ్ మొదలైంది.


  మూవీ తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్‌కు రెడీ అవుతోంది. తొలి షెడ్యూల్‌లో కర్నూలు సమీపంలోని కొండ ప్రాంతాల్లో ఇటీవల కొన్ని సీన్లు చిత్రీకరించారు. రానా దగ్గుబాటి ఈ సినిమాలో ప్రభాస్ కి బ్రదర్ గా కనిపించనున్నాడు. అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు సత్యరాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ఇండియాలోనే ఏ సినిమా తెరకక్కనంత అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.

  సినిమా పూర్తయి ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టనుంది. బాహుబలి చిత్రంలో ప్రభాస్‌ సరసన అనుష్క హీరోయిన్‌గా నటిస్తుండగా రాణా ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం కోసం 'arri alexa XT' కెమెరాలను ఉపయోగించనున్నారు. ఈచిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. అయితే హిందీ, మలయాళంతో పాటు ఇతర వీదేశీ భాషల్లోనూ విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నారు.

  ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధాన భూమిక పోషించనున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. 'బాహుబలి' చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ ఆధ్వర్యంలో సెట్స్ వేసారు.

  English summary
  Latest Buzz that, Tamil actor Sathyaraj has recommended Chennai Express fame Thangaballi to cast in Bahubali and Rajamouli is quite impressed with Thangabali after watching the film and he is planning to cast him for a special action episode , a one-to one fight with Prabhas in the film.Nikitin Dheer. Charming in person but a scary nemesis to Rahul in Chennai Express.
 Prabhas is known for his cool attitude and friendly nature off screen. On screen, he looks entirely rough in Bahubali . The second schedule of the film started yesterday and shooting is currently going on at Ramoji Film City.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more