»   » ఇదీ పవర్ స్టామినా: రూ.150కోట్ల ప్రీ-రిలీజ్ మార్కెట్, అపుడే దుమ్ము లేపుతోన్న పవన్ మూవీ!

ఇదీ పవర్ స్టామినా: రూ.150కోట్ల ప్రీ-రిలీజ్ మార్కెట్, అపుడే దుమ్ము లేపుతోన్న పవన్ మూవీ!

Subscribe to Filmibeat Telugu

హిట్-ఫ్లాపులతో సంబంధం లేని బాక్స్ ఆఫీస్ కుబేరుడు టాలీవుడ్ కాటమరాయుడు. సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు రూపంలో వరుస ఫ్లాపులు పలకరించినా.. తదుపరి సినిమా మార్కెట్‌పై ఆ ప్రభావం ఇసుమింతైనా లేదు. సరికదా!.. బాహుబలి ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో పవన్ సినిమా పోటీపడుతుందంటే.. పవర్ స్టార్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఫిలింగనర్ సర్కిల్‌లో వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం.. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న తాజా చిత్రం ఇప్పటికే రూ.150కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మార్క్‌ను అందుకుందట. బాహుబలి తర్వాత ఆ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా ఇదే కావడం విశేషం. మరో విశేషమేంటంటే!.. సింగిల్ లాంగ్వేజ్‌లో ఒక సినిమాకు ఇంత ప్రీ-రిలీజ్ మార్కెట్ క్రియేట్ అవడం టాలీవుడ్ చరిత్రలో ఇదే తొలిసారి.

The Rumoured Huge Pre-release Business Of PSPK25

కేవలం ఒక్క కోస్తా పరిధిలోనే పవన్-త్రివిక్రమ్ మూవీ రూ.50కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాల్లో ఈ సినిమా బిజినెస్‌ను లెక్కలోకి తీసుకుంటే.. రిలీజ్ కన్నా ముందే రూ.150కోట్ల మార్క్‌ను టచ్ చేసింది. ఒక్క తెలుగు సర్కిల్ లోనే ఇంత బిజినెస్ జరిగితే.. ఇక శాటిలైట్ రైట్స్, ఓవర్సీస్ మార్కెట్, దేశవ్యాప్తంగా జరిగే బిజినెస్ ను లెక్కలోకి తీసుకుంటే.. ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమంటున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకు ఏ విషయం బయటకు లీకవలేదు. అటు లుక్స్ పరంగా పవన్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు ఇటీవల లీకైన కొన్ని ఫోటోల్ని చూస్తే తెలిసిపోతోంది. ఏదేమైనా పవన్-తివ్రిక్రమ్ కాంబినేషన్ చేసే ఆన్ స్క్రీన్ మ్యాజిక్ మరోసారి రిపీట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

English summary
With the advent of the Baahubali series in Tollywood, not just the art of cinema making but the business avenue of cinema too has expanded its roots in the widest possible manner. Be it the pre-release business,
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu