twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ కోసం థియోటర్ ఓపినింగ్ వెయిటింగ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : పవన్ కల్యాణ్ తాజా చిత్రం అత్తారింటికి దారేది తో హైదరాబాద్ లో ఓ థియోటర్ ఓపినింగ్ కానుందని సమాచారం. ఈసీఐల్ లో .. రాధిక థియోటర్ ని పడగొట్టి..అక్కడ ఆసియన్ మల్టిప్లెక్స్ కట్టారు. ఆ థియోటర్ ని పవన్ కల్యాణ్ ..అత్తారింటికి దారేది చిత్రంతో ఓపినింగ్ చేయాలని యాజమాన్యం ఆలోచన. అయితే.. రాష్ట్ర విభజన ప్రకటన నేపధ్యంలో పెద్ద సినిమాలు ఆగిపోయాయి. అయితే చెన్నై ఎక్సప్రెస్ తో ఆ కాంప్లెక్స్ ఓపెన్ చేద్దామనుకున్నారు. అయితే హిందీ సినిమాతో ఎందుకని పవన్ సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నారని సమాచారం.

    కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాత మొదలైన సమక్యాంధ్ర ఉద్యమం....మరో వైపు తెలంగాణ ఉద్యమం కారణంగా తెలుగు సినీ పరిశ్రమలో మునుపెన్నడూ లేని ఒక సంక్షోభ పరిస్థితి నెలకొంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమాలన్నీ విడుదల ఆగిపోయాయి. అయితే పెద్ద సినిమాలు ఆగి పోవడం చిన్న సినిమాలకు మాత్రం కలిసొచ్చింది.

    త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈచిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా వినోదాత్మకంగా తెరకెక్కించారు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయి.

    ఈ చిత్రంలో నదియా పవన్ కళ్యాణ్ పాత్రలో, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

    English summary
    one theatre which is desperately waiting for his film ‘Attarintiki Daaredi’ to arrive as soon as possible so that it can get inaugurated and opened. All this is happening in the ECIL area in Hyderabad. There was one theatre called Radhika and now it is demolished to give rise to a new structure called the Asian Multiplex.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X