»   » సెంటిమెంట్ కలిసి వచ్చేలా చిరు 150 చిత్రం టైటిల్ మార్పు

సెంటిమెంట్ కలిసి వచ్చేలా చిరు 150 చిత్రం టైటిల్ మార్పు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి తన 150 వ చిత్రం టైటిల్ కత్తిలాంటోడు అంటూ ఆ మధ్యన సినిమా ప్రారంభానికి ముందు ఫ్యాన్స్ సమక్షంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియా అంతా కత్తిలాంటోడు అంటూనే ఈ సినిమా గురించి రాసినప్పుడు, మాట్లాడినప్పుడు ప్రస్దావిస్తూ వస్తోంది. అయితే రీసెంట్ గా రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ..కత్తిలాంటోడు టైటిల్ ని ఫైనలైజ్ చేయలేదని అన్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం..చిరంజీవి ఈ చిత్రం టైటిల్ ని మార్చాలనే ఆలోచనలో ఉన్నారట. కత్తిలాంటోడు టైటిల్ పెడితే మరీ సరైనోడు, స్పీడున్నోడు టైటిల్స్ గుర్తుకు వస్తున్నాయని, అందుకే వేరే టైటిల్ పెడదామనే వివి వినాయిక్ తో సంప్రదింపులు చేస్తున్నారట.

Title Change for Chiru 150?

అయితే సెంటిమెంట్స్ ని బాగా నమ్మే వినాయిక్ ..ఈ చిత్రానికి ఖైదీ నెంబర్ 786 (చిరంజీవి సూపర్ హిట్ చిత్రం) తరహాలో 'ఖైదీ నెంబర్.150'అని పెడదామని అనుకుంటున్నారట. చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమా ఖైది. అలాగే ఖైదీ నెంబర్ 786 కూడాను. దాంతో అదే సెంటిమెంట్ తో టైటిల్ ని మార్చే కార్యక్రమాలు చేపట్టాలని ఫిక్స్ అయ్యి..ఆ పనిలో ఉన్నట్లు చెప్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చేవెళ్ల మండలం న్యాలట అనుబంధ గ్రామమైన సింగప్ప గూడలో జరుగుతోంది. అఖ్కడ పల్లె వాతావరణంలో ప్రజల మధ్య జరిగే కొన్ని సీన్స్ ను చిరంజీవితో పాటు జూనియర్ ఆర్టిస్ట్ లపైనా చిత్రీకరించారు. షూటింగ్ విషయం తెలిసిన చుట్టుప్రక్కల ఊళ్లలో జనం , అభిమానులు అక్కడికి చేరుకుంటున్నారు. ఇదే గ్రామంలో మరో నాలుగు రోజులు పాటు షూటింగ్ జరగనుందని తెలుస్తోంది.

ఇప్పటికే భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తెర వెనుక పనిచేసే వారి విషయంలో దర్సకుడు వివి వినాయిక్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాధారణంగా వినాయక్ సినిమా అంటే సాధారణంగా ఆకుల శివ రచయితగా వ్యవహరిస్తాడు. కానీ ఇది చిరంజీవి 150వ సినిమా కాబట్టి అభిమానులు చిరంజీవి పోలిటికల్ ఇమేజ్ కు తగ్గట్టుగా సందేశాత్మకమైన మాటలను కూడా ఆశిస్తారు.

అందుకే ఆలోటు తీర్చేందుకు సాయి మాధవ్ ను రంగంలోకి దించినట్లు చెప్తున్నారు. సాయి మాధవ్ డైలాగుల్లో సామాజిక అంశాలతో పాటు, సందేశాలు కూడా వినిపిస్తుండటంతో చిరు పిలిచి మరి అవకాశం ఇచ్చారని తెలుస్తోంది.

English summary
Chiranjeevi 150th movie team is planning to title the movie as ‘Khaidi no.150’.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu