పెళ్లికి సిద్ధమవుతున్న రాజ్ తరుణ్.. ఇష్టమైన అమ్మాయితోనే.. డేట్ ఫిక్స్?
టాలీవుడ్ ఇండస్ట్రీలో గత ఏడాది లాక్ డౌన్ లోనే సినిమా తారలకు సంబంధించిన పెళ్లి వార్తలు చాలానే వైరల్ అయ్యాయి. ఒకరి తరువాత మరొకరు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని బ్యాచిలర్ లైఫ్ కు శుభం కార్డు వేసేశారు. ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫొటోలను చూస్తేనే అర్ధమవుతోంది. ఇక ప్రస్తుతం యువ హీరో రాజ్ తరుణ్ కూడా పెళ్లికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

తక్కువ సమయంలోనే..
షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న రాజ్ తరుణ్ ఆ తరువాత సినీ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మామ, కుమారి 21F వంటి సినిమాలతో మొదట కాస్త బాగానే మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. చాలా తక్కువ సమయంలోనే రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచాడు.

ఎంత కష్టపడినా కూడా
అయితే మొదట్లో హిట్స్ అందుకున్నంత రేంజ్ లో ఆ తరువాత అదే ఫ్లోను కంటిన్యూ చేయలేకపోయాడు. గత కొంతకాలంగా అతను ఎలాంటి సినిమాలు చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ప్లాప్ అవుతున్నాయి. ఎంత కష్టపడినా కూడా ఫలితం దక్కడం లేదు. దానికితోడు కొన్ని కమిట్మెంట్స్ కారణంగా కూడా రాజ్ తరుణ్ తెలిసి కూడా నచ్చని సినిమాలు చేయాల్సి వచ్చింది.

కొత్త ఇంట్లోకి రాజ్ తరుణ్ ఫ్యామిలీ
రెమ్యునరేషన్ కు బదులు గతంలో రాజ్ తరుణ్ ఒక ప్రముఖ నిర్మాత నుంచి బాంగ్లా తీసుకున్నట్లు టాక్ వచ్చింది. వరుసగా కొన్ని సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అది ఎంతవరకు నిజమో గాని మొత్తానికి ఒక కొత్త ఇల్లు అయితే సెట్ చేసుకున్నాడు. ఫ్యామిలీతో కలిసి ఇటీవల కొత్త ఇంటికి కూడా షిఫ్ట్ అయినట్లు సమాచారం.
Recommended Video

పెళ్లికి కూడా గ్రీన్ సిగ్నల్..
అలాగే రాజ్ తరుణ్ కూడా పెళ్లికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. గత కొంత కాలంగా ఈ హీరో పెళ్లికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల హీరో తన ఇంట్లో వాళ్లని కూడా ఒప్పించినట్లు టాక్ వస్తోంది. ముందు నిశ్చితార్థం చేసుకొని అనంతరం ఈ ఏడాది చివరలో లేదా 2022 స్టార్టింగ్ లో గాని పెళ్లికి ముహూర్తం సెట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఈ విషయంపై రాజ్ తరుణ్ అఫీషియల్ గా ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











