»   » రానా, సురేష్ బాబు చేసిన పనికి.... దిల్ రాజు అప్‌సెట్??

రానా, సురేష్ బాబు చేసిన పనికి.... దిల్ రాజు అప్‌సెట్??

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినీ ఇండస్ట్రీలో వచ్చే వారం(ఆగస్టు 11) మూడు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. రానా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి', నితిన్ 'లై' మూవీ, బోయపాటి దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన 'జయ జానకి నాయక'.

ఆగస్టు 11వ తేదీ బాగా కలిసొచ్చే తేదీగా టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే వరుసగా హాలిడేస్ వస్తున్నాయి. ఆగస్టు 11న సినిమా రిలీజ్ చేస్తే.... 12, 13. 14, 15 ఇలా వరుసగా సెలవులు. దీంతో థియేటర్లు ప్రేక్షకుల రద్దీతో కళకళలాడటం ఖాయం.

రానా వల్ల దిల్ రాజు అప్ సెట్?

రానా వల్ల దిల్ రాజు అప్ సెట్?

రానా మూవీ ‘నేనే రాజు నేనే మంత్రి' సినిమా వల్ల దిల్ రాజు అప్‌సెట్ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విషయంలో రానా, సురేష్ బాబులు తమ నిర్ణయాన్ని ఉన్నట్టుండి మార్చుకోవడమే ఇందుకు కారణమని అని అంటున్నారు.

Tollywood Summer Collections : 700 crore - Filmibeat Telugu
మాట మార్చారా?

మాట మార్చారా?

‘నేనే రాజు నేనే మంత్రి' సినిమాను మొదట ఆగస్టు 18న తమిళ వెర్షన్ తో కలిసి రిలీజ్ చేస్తామని చెప్పారట సురేష్ బాబు. దీంతో ‘లై' మూవీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకున్న దిల్ రాజు ఆగస్టు 11న తన సినిమాను రిలీజ్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఉన్నట్టుండి ‘నేనే రాజు నేనే మంత్రి' మూవీ రిలీజ్ డేట్ మార్చడంతో దిల్ రాజు కాస్త అప్ సెట్ అయ్యారట.

దిల్ రాజు బాధ అదే...

దిల్ రాజు బాధ అదే...

ఈ సినిమాలతో పాటు బోయపాటి దర్శకత్వంలో వస్తున్న ‘జయ జానకి నాయక' మూవీ కూడా 11న తేదీనే విడుదలవుతోంది. ఒకేసారి మూడు సినిమాలు రిలీజ్ చేయడం ద్వారా థియేటర్లు తక్కువగా దొరకడంతో పాటు రెవెన్యూ కూడా తగ్గిపోతుందని, దీని వల్ల ఎవరికీ ఎలాంటి లాభం ఉండదని ఆయన వర్రీ అవుతున్నారట.

రంగంలోకి అల్లు అరవింద్

రంగంలోకి అల్లు అరవింద్

సురేష్ బాబుకు, దిల్ రాజుకు సన్నిహితంగా ఉండే అల్లు అరవింద్ కల్పించుకుని వీరి మధ్య పరిస్థితిని చక్కదిద్దేలా చోరవ తీసుకుంటున్నట్లు సమాచారం.

English summary
August 11th is being widely discussed in Tollywood with the likes of Rana's Nene Raju Nene Mantri, Boyapati's Jaya Janaki Nayaka and Niti's LIE hitting cinemas.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu