twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీతారామం సినిమాను రిజెక్ట్ చేసిన టాలెంటెడ్ హీరోలు.. కారణం ఏమిటంటే?

    |

    ఒక సినిమా రిజల్ట్ అనేది ఎప్పుడూ కూడా ఊహలకు అందని విధంగా ఉంటుంది. కొన్నిసార్లు స్టోరీ ఎంతో బాగా కనెక్ట్ అయినప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్దకు వచ్చేసరికి తీవ్రంగా నిరాశ పరుస్తుంది. మరి కొన్ని కథలు ఏదో యావరేజ్ గా ఆడతాయి అని అనుకున్నప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇక సీతారామం సినిమా కథను వినగానే నిర్మాతలు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఈ సినిమా భారీ బడ్జెట్ తోనే తెరపైకి తీసుకురావాలి అని మంచి విజయాన్ని అందుకుంటుంది అని నమ్మారు.

    కానీ ఆ సినిమా కథను కొంతమంది హీరోలు రిజెక్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దర్శకుడు హను రాఘవపూడి ఇదివరకే వరుసగా రెండు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన డిజాస్టర్ అందుకున్నాడు. మొదట అందాల రాక్షసి సినిమాతో పరవాలేదు అనిపించే విధంగా సక్సెస్ కొట్టి.. ఆ తర్వాత కృష్ణ గాడి వీర ప్రేమ కథ సినిమాతో కూడా మంచి విజయాన్ని అయితే అందుకున్నాడు. కానీ ఆ తర్వాత చేసిన లై, పడి పడి లేచే మనసు రెండు కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయ్యాయి.

    Tollywood talented heroes rejected Sitaramam project before Dulquer Salmaan accept

    దీంతో ఆ దర్శకుడికి మరొక అవకాశం ఇవ్వడానికి కూడా ఎవరు ధైర్యం చేయలేకపోయారు. కానీ వైజయంతి మూవీస్ అతని టాలెంట్ ని నమ్మి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇక హను రాఘవపూడి మొదట ఈ కథ రాసుకున్నప్పుడు దుల్కర్ సల్మాన్ కంటే ముందే ఒక ముగ్గురు హీరోలకు చెప్పినట్లుగా తెలుస్తోంది. మొదట అందులో నాని ఉన్నాడట. ఈ దర్శకుడు ఇదివరకు ఎదుర్కొన్న రిజల్ట్ ను చూసి అతను ధైర్యం చేయలేకపోయడట.

    అలాగే రామ్ పోతినేని కూడా ఈ కథను విన్నట్లు సమాచారం. కానీ అప్పటికే అతను మాస్ కమర్షియల్ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టడం వలన సీతారామం సినిమాతో రిస్క్ చేయాలని అనుకోలేదట. ఇక ఈ లిస్టులో విజయ్ దేవరకొండ కూడా ఉన్నట్లు ఒక టాక్ వచ్చింది. కానీ విజయ్ దేవరకొండ అప్పటికే వేరే కమిట్మెంట్స్ తో ఉన్నాడు. అందుకే అప్పుడు ఈ కథపై పెద్దగా ఆసక్తి చూపలేదట. ఏది ఏమైనా కూడా సీతారామం సినిమా దుల్కర్ సల్మాన్ చేయడం వలన ఒక విధంగా మంచే జరిగింది. అతను ఈ సినిమా కథకు తగ్గట్టుగా కరెక్ట్ గా సెట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రాఫిట్స్ అయితే అందుకుంటుంది.

    English summary
    Tollywood talented heroes rejected Sitaramam project before Dulquer Salmaan accept
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X