టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, నటుడి మరణానికి డ్రగ్సే కారణం?
టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఎక్సైజ్ శాఖ 15 మంది టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు అందించడంతో అంతా షాక్ అయ్యారు. వీరిని ఈ నెల 19 నుండి విచారించనున్నారు.
హైదరాబాద్: టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఎక్సైజ్ శాఖ 15 మంది టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు అందించడంతో అంతా షాక్ అయ్యారు. వీరిని ఈ నెల 19 నుండి విచారించనున్నారు.
కెల్విన్ ముఠా వెల్లడించిన విషయాలు పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కెల్విన్ ముఠా చెప్పిన వివరాల ఆధారంగానే పోలీసులు టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు అందజేసినట్లు తెలుస్తోంది.

కొన్ని రోజుల క్రితం హఠాన్మరణానికి గురైన మ్యూజిక్ డైరెక్టర్, కొన్ని రోజుల క్రితం మరణించిన మరో నటుడికి తానే డ్రగ్స్ ఇచ్చినట్టు కెల్విన్ పోలీసులకు వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. వారిద్దరికీ నిత్యం డ్రగ్స్ సరఫరా చేశానని తెలిపినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











