»   » ఎమ్.ఎస్ రాజు RUMలో అర్చన

ఎమ్.ఎస్ రాజు RUMలో అర్చన

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: తాజాగా ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్ రాజు RUM అనే టైటిల్ రిజిస్టర్ చేయించిన సంగతి తెలిసిందే. ఆ టైటిల్ రమ్ అంటే రంభ, ఊర్వశి, మేనక అని . ఈ మూడు పాత్రల్లో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. త్రిష,పూర్ణలను ఇప్పటికే ఎంపికచేసారు. తాజాగా వీరితో పాటు మూడో హీరోయిన్ గా చేయటానికి అర్చన ముందుకొచ్చింది. విభిన్న కథాంశంతో హీరోయిన్స్ బేస్డ్ చిత్రంగా రూపొందనుంది. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

  ప్రస్తుతం అర్చన... నందమూరి తారకరత్న 'మైక్‌ టెస్టింగ్‌ 143'లో నటిస్తోంది. ఈ చిత్రం తప్ప ఆమెకు మరే సినిమా లేదు. అలాగే ఎమ్ ఎస్ రాజు... గత చిత్రం నువ్వు వస్తానంటే నేవద్దంటానాలో అర్చనకీ రోల్ చేసింది. ఇక రవిబాబు 'అవును' చిత్రంతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న పూర్ణ మరో చిత్రం కమిటంతో క్రేజ్ వచ్చింది. ఎమ్.ఎస్.రాజు నిర్మిస్తున్న కొత్త చిత్రంలో ఆమె త్రిషతో పాటు నటించనుంది. ఇది త్రిష కెరీర్ లో పెద్ద ప్రాజెక్టుగా నిలవనుంది. ఈ మేరకు ఆమెతో ఎగ్రిమెంట్ కుదిరిందని సమాచారం. ఇక పూర్ణ తెలుగులో అవును చిత్రానికి ముందు సీమ టపాకాయ లో చేసింది. అయితే అవునులో కథ ఆమె చుట్టూ తిరగటం,సినిమాలో ఆమె నటన హైలెట్ కావటంతో ఆమెపై తెలుగు దర్శక, నిర్మాతల దృష్టి పడింది.

  త్రిష విషయానికి వస్తే ఆమె గతంలో ఎమ్ ఎస్ రాజు బ్యానర్ లో మూడు చిత్రాలు చేసింది. ఆ బ్యానర్ లో ఆమె చేసిన వర్షం చిత్రం సూపర్ హిట్టైంది. ఆ సినిమాతో తెలుగులో ఆమె లాంచ్ అయ్యింది. అలాగే ఆ తర్వాత ఆమె సిద్దార్ద తో చేసిన నువ్వు వస్తానంటే నే వద్దంటానా చిత్రం కూడా మెగా హిట్టై తెలుగులో ఆమెకు కెరీర్ నిలబడేలా చేసింది. ఆ తర్వాత చేసిన పౌర్ణమి చిత్రం ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఆ బ్యానర్ లో ఆమె ఏ చిత్రమూ చేయలేదు. చిరకాలం గ్యాప్ తర్వాత ఈ కాంబినేషన్ లో చిత్రం రావటంతో ట్రేడ్ లో క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.

  ఈ చిత్రం హీరోయిన్ చుట్టూ తిరిగే కథ అని సమాచారం. పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడవుతాయి. ఇక ఈ చిత్రం టైటిల్ తొలకరి అని ప్రచారంలో ఉంది. అయితే ఈ చిత్రం ఎమ్మెస్ రాజు డైరక్ట్ చేస్తారా లేదా అని తెలియాల్సింది ఉంది. ఎమ్ ఎస్ రాజు డైరక్ట్ చేసిన తూనీగ... తూనీగ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంతో తన కుమారుడుని పరిచయం చేస్తూ తానే డైరక్ట్ చేసారు. అయితే మరీ పాతకాలం తరహా కథ, కథనాలతో, టీవీ సీరియల్ ట్విస్టులతో సినిమా తయారవటంతో ముంచేసింది.

  English summary
  RUM is an upcoming Telugu movie that features petite siren Trisha, glamour queen Poorna and Telugu heroine Archana Sastry. The creativity behind this alcoholic title is that it stands for Ramba-Urvasi-Menaka. Producer MS Raju is the creative sculptor of this title and he has taken this heroine oriented project after failing to launch his son Sumanth Ashwin with a dreamy debut.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more