»   » రెమ్యూనరేషన్ పెంచిన త్రివిక్రమ్...ఎంతో తెలుసా?

రెమ్యూనరేషన్ పెంచిన త్రివిక్రమ్...ఎంతో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తాజా సినిమా 'అత్తారింటికి దారేది' చిత్రం భారీ విజయం సాధించడంతో తన రెమ్యూనరేషన్ భారీగా పెంచేసాడని ఫిల్మ్ నగర్ టాక్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ప్రస్తుతం సినిమా చేయడానికి రూ. 12 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు వినికిడి.

రైటర్‌గా ఉన్నప్పుడు రూ. కోటికి‌పై రెమ్యూనరేషన్ తీసుకుని వార్తల్లోకెక్కిన త్రివిక్రమ్.....దర్శకుడిగా అనతి కాలంలోనే అగ్రస్థానికి చేరుకున్నాడు. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా త్రివిక్రమ్ సినిమాలకు మార్కెట్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో తనకున్న డిమాండ్ అనుగుణంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.

'అత్తారింటికి దారేది' చిత్రానికి త్రివిక్రమ్ రూ. 8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో ఏకంగా రూ. 12 కోట్లకు రెమ్యూనరేషన్ పెంచినట్లు చర్చించుకుంటున్నారు. త్రివిక్రమ్ అడిగిన మొత్తం ఇవ్వడానికి పలువురు నిర్మాతలు ఆసక్తి చూపుతుండటం గమనార్హం.

త్రివిక్రమ్ డైలాగ్స్, ఆయన దర్శకత్వ శైలి వెరసి.....ఆయనకు ఇంత డిమాండ్ తెచ్చిపెట్టిందనడంలో సందేహం లేదు. ఆయనతో చేయడానికి పలువురు స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపుతుండటంతో ఎంతైనా పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు వెనకాడటం లేదు. అదన్నమాట సంగతి.

English summary

 Trivikram Srinivas who got a hit with Pawan Kalyan's ‘Attarintiki Daaredhi, is increased his remuneration doubling it from his current pay. Trivikram who got Rs 8crs is now demanding Rs 12 crs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu