»   » త్రివిక్రమ్ కొత్త సినిమా :సెప్టెంబర్ లో ప్రారంభం,సమ్మర్ రిలీజ్

త్రివిక్రమ్ కొత్త సినిమా :సెప్టెంబర్ లో ప్రారంభం,సమ్మర్ రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంతో కొద్దిగా డీలా పడ్డ త్రివిక్రమ్ మరో సారి తన ప్రతిభను చూపటానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఆయన తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. నితిన్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కనుంది. సెప్టెంబర్ లో చిత్రం ప్రారంభమయ్యి...సమ్మర్ కు రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని ఎస్ రాధాకృష్ణ ..తన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు.

గతంలో...

ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్, యంగ్ హీరో నితిన్ తో మరో సినిమా చేయనున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నితిన్, పూరి ఇద్దరూ కూడా ఖరారు చేసారు. మొన్ననే ఫైనల్ నేరేషన్ విన్నాను. సినిమా ఓ హార్ట్ టచ్చింగ్ పాయింట్ తో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ..జూన్ 15 నుంచి షూటింగ్ అని నితిన్ ఆనందంగా కూడా ట్వీట్ చేసారు. అయితే ఇప్పుడా సినిమా ఆగిపోయింది. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా ఖరారు చేసి మీడియాకు తెలియచేసారు.

Trivikram project to kick start in September

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నితిన్ ట్వీట్ చేస్తూ... కొన్ని అనివార్య కారణాల వల్ల పూరి జగన్నాధ్ గారితో నేను చేయాల్సిన సినిమాను ఆపేస్తున్నాం. ప్యూచర్ లో ఆయనతో పనిచేస్తానని ఆశిస్తున్నాను అని ట్విట్ చేసారు.

గతంలో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘ గతంలో నితిన్ నాకు ఒక మంచి వ్యక్తిగా తెలుసు. ఎప్పటి నుంచి అయితే అతనితో పనిచేసానో అప్పటి నుంచి అతనితో ప్రేమలో పడిపోయాను. అతను ఎంతో కష్టపడి పనిచేస్తాడు, అలాగే అతని ఎనర్జీ లెవల్స్ బాగా హై రేంజ్ లో ఉంటాయి. ఎప్పటి నుంచో సినిమా చెయ్యాలనుకుంటున్నాం అది ఇప్పటికి కుదిరింది.' అని అన్నాడు. మరి ఈ లోగా ఏం తేడాలో వచ్చాయో ఏంటో ఇలా కాన్సిల్ అయ్యింది ఈ ప్రాజెక్టు.

English summary
The regular shooting of Trivikram Srinivas, Nitin film will kick start in September and the makers are planning to release this film in Summer next year. S.Radha Krishna will produce this film under his Haarika and Hassine Creations.
Please Wait while comments are loading...