For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  త్రివిక్రమ్‌కు ఆ పేరంటే అంత ఇష్టమా.. ఎవరు అడిగినా ఇవ్వకుండా.. మహేష్‌కి ఇస్తాడా?

  |

  మన సినిమా ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలు అలాగే నటీనటుల ఎక్కువగా సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.. సినిమా ముహూర్తం మొదలు కాంబినేషన్ దాకా అనేక విషయాల్లో సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు.. అర్జీవీ లాంటి ఒకరిద్దరు పట్టించుకోరేమో కానీ దాదాపు సినిమా ఇండస్ట్రీ అంతా ఇలాంటి సెంటిమెంట్ ను ఫాలో అవుతూనే ఉంటుంది.. ఈ విషయంలో త్రివిక్రమ్ కూడా అతీతుడు ఏమీ కాదు. ఆయన ఎక్కువగా తన సినిమాలకు అ అనే అక్షరంతో టైటిల్ వచ్చేలా చూసుకుంటాడు.. కానీ మొట్ట మొదటి సారి మహేష్ బాబు సినిమా కోసం ఆయన పార్ధు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.. దాని వెనుక పెద్ద స్టోరీ ఉందని తెలుస్తోంది వివరాల్లోకి వెళితే.

  మోస్ట్ అవెయిటెడ్ కాంబో

  మోస్ట్ అవెయిటెడ్ కాంబో

  దాదాపు 11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాను నిర్మిస్తున్న హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. నిజానికి వీరిద్దరి కాంబినేషన్ లో మొట్ట మొదటిగా వచ్చిన అతడు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన మహేష్ ఖలేజా సినిమా మాత్రం నిరాశ పరిచింది.. అయినప్పటికీ ఆ తర్వాత వీరిద్దరితో సినిమా చేయాలని చాలామంది నిర్మాతలు ప్రయత్నించారు. ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయాలని భావించడంతో చాలా సార్లు సినిమా కధా చర్చల దాకా వచ్చి ఆగిపోయింది. అయితే ఎట్టకేలకు ఆ సినిమా కుదిరింది.

  రా ఏజంట్

  రా ఏజంట్

  అయితే ఇప్పుడు ఆ సినిమా విషయంలో ఆసక్తికర ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక రా ఏజెంట్ గా నటిస్తున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమాకి టైటిల్ పరిశీలిస్తున్నట్లు కూడా రెండు రోజుల నుంచి ప్రచారం మొదలైంది. అయితే అది వర్కింగ్ టైటిల్ అని అసలు టైటిల్ అలా ఉండకపోవచ్చు అని కూడా కొందరు అంటున్నారు. అయితే ఈ విషయానికి సంబంధించి లోతుగా పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

  అతడు కంటే ముందే పార్ధు

  అతడు కంటే ముందే పార్ధు

  అది ఏమిటి అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ పార్ధు అనే టైటిల్ ను చాలా సంవత్సరాల క్రితం రిజిస్టర్ చేసుకున్నారట. అప్పటి నుంచి ఆయన ఈ పేరుతో ఒక సినిమా తీయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన అతడు సినిమాలో మహేష్ పేరు పార్ధు కాబట్టి ఆ పేరుతో సినిమా తీయాలని ప్రయత్నించడం లేదు. దానికి మరో కారణం ఉందట. త్రివిక్రమ్ కి ఇష్టమైన నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి రచించిన నవలలో ఒకదాని పేరు పార్ధు. ఆ నవల చదివినప్పటి నుంచే త్రివిక్రమ్ ఈ పేరు మీద మక్కువ పెంచుకున్నాడు అని తెలుస్తోంది. ఎప్పటికైనా ఈ పేరుతో ఓ సినిమా చేయాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది..

  SSMB 28 లో Mahesh Babu పాత్ర ఇదేనట | Mahesh Babu Trivikram Movie || Filmibeat Telugu
   ఎవరు అడిగినా ఇవ్వకుండా మహేష్ కోసం

  ఎవరు అడిగినా ఇవ్వకుండా మహేష్ కోసం

  అందుకే చాలా ఏళ్ల నుంచి ఈ టైటిల్ను ఆయనే ఛాంబర్ లో రెన్యువల్ చేయించుకుంటూ వస్తున్నారట. మొన్నామధ్య సునీల్ నారంగ్ నాగశౌర్యతో తీస్తున్న లక్ష్య సినిమా కోసం పార్ధు అనే టైటిల్ అనుకున్నారు.. త్రివిక్రమ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న విషయం తెలిసి ఆయనను కలిసి అడిగినా త్రివిక్రమ్ ఆ టైటిల్ ఇవ్వడానికి ఇష్టపడలేదు అట. మరో నిర్మాత కూడా టైటిల్ కోసం త్రివిక్రమ్ ను కలిసినా సరే పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. అలా చాలా సంవత్సరాలుగా దాచుకుంటూ వస్తున్న టైటిల్ తో ఇప్పుడు మహేష్ బాబు సినిమా ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది . ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది తెలియాల్సి ఉంది.

  English summary
  An official announcement about the third collaboration of Superstar Mahesh Babu and top director Trivikram was made recently. The film’s official launch will take place at the end ofg this month. The makers are currently considering Pardhu as the title for the movie. But there is an another story behind this pardhu title.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X