»   » ‘అ..ఆ’ బడ్జెట్, త్రివిక్రమ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే...

‘అ..ఆ’ బడ్జెట్, త్రివిక్రమ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'అ..ఆ' మూవీ నిన్న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కేవలం త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడన్న కారణంతోనే సినిమాపై ముందు నుండీ అంచనాలు భారీగా ఉన్నాయి. ఊహించినట్లుగానే సినిమా త్రివిక్రమ్ మార్కుతో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేస్తోంది.

ఈ సినిమాకు రివ్యూలు కూడా పాజిటివ్ గా రావడంతో పంపిణీదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు 'సర్దార్ గబ్బర్ సింగ్', 'బ్రహ్మోత్సవం' సినిమాలతో నష్టాలను చవిచూసారు. అయితే 'అ..ఆ' సినిమా విషయంలో మాత్రం పింపిణీదారులంతా హ్యాపీగా ఉన్నారు.

trivikram

ఈ సినిమాను రూ. 45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారట. ఈ సినిమా నిర్మాణ విలువలు బాగా రిచ్ గానే ఉన్నాయి. అయితే 45 కోట్లు ఖర్చు పెట్టినట్లు మాత్రం సినిమాలో ఎక్కడా కనిపించదు. అయితే ఇంత బడ్జెట్ ఎందుకు అయిందో? అనే విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే.

'అత్తారింటికి దారేది' సినిమా తర్వాత నిర్మాత త్రివిక్రమ్ టాప్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయారు. ఆ సినిమా తర్వాత నుండి ఆయనకు నిర్మాతు రూ. 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. తాజాగా 'అ..ఆ' సినిమాకు త్రివిక్రమ్ ఏకంగా రూ. 15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అంటే సినిమా బడ్జెట్లో మూడో వంతు. అందుకే సినిమా బడ్జెట్ 45 కోట్లు అయిందట. అయితే త్రివిక్రమ్ లాంటి సత్తా ఉన్న దర్శకుడికి ఈ మాత్రం ఇవ్వడం సబబే అంటున్నారు.

English summary
We heard that Trivikram's remuneration was quoted as 15 crores for 'A Aa' and that is the reason why the makers are saying that the film cost them 45 crores.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu