»   » వర్కవుట్ అవుతుందా? : పూరి జగన్నాథ్ దారిలోనే త్రివిక్రమ్ కూడా

వర్కవుట్ అవుతుందా? : పూరి జగన్నాథ్ దారిలోనే త్రివిక్రమ్ కూడా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రీసెంట్ గా...పూరి జగన్నాథ్ గ్యాప్ లో ఛార్మిని ప్రధాన పాత్రలో పెట్టి జ్యోతిలక్ష్మి అనే చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా అదే దారిలో ప్రయాణం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సమంత ప్రధానపాత్రలో ...తక్కువ బడ్జెట్ లో..తక్కువ షూటింగ్ డేస్ లో ఈ చిత్రం పూర్తి చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సమంతకు, త్రివిక్రమ్ కు ఉన్న అనుబంధతో ఈ ప్రపోజల్ ని సమంత ముందు పెట్టినట్లు ఆమె కూడా ఆసక్తి చూపుతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల్లో సమంత హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే.

కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుందంటూ వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని సుకుమార్ చేయబోతున్న చిత్రం తర్వాత పట్టాలు ఎక్కించనున్నారు. ఈ గ్యాప్ లో సమంత తో త్రివిక్రమ్ చిత్రం పూర్తి చేయాలని భావించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.

Trivikram's Lady Oriented Film With Samantha?

ఇక సన్నాఫ్ సత్యమూర్తి అనుకున్న రేంజిలో హిట్ కాకపోవటంతో ఆయనతో చేయటానికి ఏ మేరకు హీరోలు ఉత్సాహంగా ముందుకు వస్తారు అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ చిత్రం తర్వాత అంతా మహేష్ తో చిత్రం చేస్తారని అనుకున్నారు.

అయితే మహేష్ ...ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయటానికి కమిటయ్యారని తాజాగా ఎనౌన్సమెంట్ వచ్చింది. దాంతో మహేష్ ...త్రివిక్రమ్ కు ఈ సంవత్సరం డేట్స్ ఇవ్వనట్లే అని తేలింది. పోనీ పవన్ తో చేద్దామా అంటే ఆయన గబ్బర్ సింగ్ 2 ఇంకా మొదలు కాలేదు. ఆ చిత్రం ఫినిష్ అయ్యి...త్రివిక్రమ్ దగ్గరకు రావటానికి టైమ్ పడుతుంది.

రామ్ చరణ్ చూస్తుంటే ప్రస్తుతం శ్రీను వైట్ల తో చిత్రం చేస్తూ బిజీగా ఉన్నారు. తర్వాత చిత్రం సురేంద్ర రెడ్డి దర్సకత్వంలో చేస్తారని తెలుస్తోంది. ఇలా రెండు ప్రాజెక్టులతో ఆయన బిజీగా ఉన్నారు.

Trivikram's Lady Oriented Film With Samantha?

ఎన్టీఆర్ ...ఇటు సుకుమార్ దర్శకత్వంలో చిత్రం ఫినిష్ చేసుకుని కత్తి రీమేక్ చేయాలి. ఆయనకు పెద్ద క్యూ ఉంది. దాంతో ఎన్టీఆర్ తో ఇప్పుడిప్పుడే చేసే ఛాన్స్ కనపడటం లేదు. అల్లు అర్జున్ తో వెంటనే చేయలేరు. అయినా బన్ని ఇప్పటికే బోయపాటి శ్రీను చిత్రం తో బిజిగా ఉన్నారు.

ప్రభాస్ విషయానికి వస్తే... రన్ రాజా రన్ దర్శకుడుతో తన తదుపరి చిత్రం ప్లాన్ చేసుకున్నారు. ఇంకా బాహుబలి 2 లో షూటింగ్ పార్ట్ ఫినిష్ కావాల్సి ఉంది. ఆ తర్వాత మాత్రమే తర్వాత ఏంటి అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇలా త్రివిక్రమ్ స్దాయిలో ఉన్న హీరోలు అంతా బిజీగ ఉన్నారు.

ఈ నేపధ్యంలో త్రివిక్రమ్ తన తదుపరి చిత్రం పవన్ తో చేయటమే బెస్ట్ అని నిర్ణయానికి వచ్చి ఉంటాడంటున్నారు. పవన్ కోసం ఆయన ఇప్పటికే కోబలి కథ వండుతున్నారు. ఆ పనుల్లో బిజీగా ఉన్నారంటున్నారు. కొంతకాలం గ్యాప్ ఉన్నా పవన్ తో చేయటంతో అది కాంపన్సేట్ అవుతుందనే భావనలో ఆయన ఉన్నట్లు సమాచారం.

Trivikram's Lady Oriented Film With Samantha?

పవన్ కళ్యాణ్ త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. జల్సా,అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. చిత్రం 'కోబలి' టైటిల్ తో రూపొందనుంది. ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్టు వర్క్ పూర్తి చేసి పవన్ కి వినిపించటం జరిగింది. అంతేకాదు చిత్రంలో హీరోయిన్ గా అనుష్క ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. రెగ్యులర్ హీరోయిన్ రోల్ కాదని, కథలో కీలకంగా ఉంటూ హీరోతో సమానంగా నడిచే పాత్ర అంటున్నారు. కాబట్టే అనుష్క ని సీన్ లోకి తీసుకురావటానికి నిర్ణయించుకున్నట్లు చెప్పుకుంటున్నారు

అందరూ కోబలి ఆగిపోయిందనుకున్నారు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం అలాంటిదేమీ లేదని క్లారీఫై చేసారు. ఇప్పుడు 'గబ్బర్‌ సింగ్‌ 2' ప్రక్కన పెట్టి మరీ కోబలి పూర్తి చేసే ఆలోచనలో పవన్ ఉండబట్టే గడ్డం లుక్ తో ఆయన కనపడ్డారు అని చెప్పుకుంటున్నారు. మరోవైపు పవన్‌ కోసం పలు కథలు సిద్ధమవుతున్నాయి. 'గబ్బర్‌ సింగ్‌ 2' స్క్రిప్టు పనులు చురుగ్గా సాగుతోంటే, మరోవైపు దర్శకుడు డాలీ కూడా పవన్‌ కల్యాణ్‌ కోసం కథ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

English summary
Trivikram Srinivas is planning to direct a female oriented film starring none other than his favorite muse, Samantha. Buzz says that this film will be wrapped up within a low budget and less number of shooting days.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu