మహేష్ ఫ్యాన్స్ కి పండగే.. నారీ నారీ నడుమ మురారి.. ఆ బాలీవుడ్ భామ కూడా ఫిక్స్?
సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం చేస్తున్నారు. పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి. ప్రకటించిన దాని ప్రకారం అయితే ఇక సర్కారు వారి పాట చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. మరి కరోనా కారణంగా లేట్ అవుతుందేమో చూడాలి. ఇక మహేష్ బాబు ఈ సినిమా తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ సినిమాలో ఇద్దరు భామలను ఫైనల్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
తాజాగా వినిపిస్తున్న వార్తలు ప్రకారం త్రివిక్రమ్ - మహేష్ బాబు ప్రాజెక్టును లాంచ్ చేయడానికి ముహూర్తం ఖాయమైపోయింది అని అంటున్నారు. మే 31వ తేదీ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సినిమా లాంచ్ మాత్రమే కాక ఏదైనా అప్ డేట్ వస్తుందని భావిస్తున్నారు. కృష్ణ పుట్టినరోజు నాడే సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించాలి అని ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. కరోనా కారణంగా చాలా సింపుల్ గా ఈ కార్యక్రమాన్ని జరపనున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ అన్ని సినిమాల్లో ఇద్దరేసి హీరోయిన్స్ ఉంటారు.

వినిపిస్తున్న టాక్ ప్రకారం త్రివిక్రమ్ ఈ సినిమా కోసం కూడా ఇద్దరు హీరోయిన్స్ ను సెలెక్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే ఒక హీరోయిన్ గా పూజా హెగ్డేని ఫైనల్ చేసినట్లు రూమర్స్ అయితే వచ్చాయి కానీ ఆ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా రెండో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ను ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు. సౌత్ లో సినిమాలు చేయాలని చూస్తున్న ఆ భామ కూడా సినిమా చేయడానికి ఒప్పుకుందని అంటున్నారు. ఇక ఎన్ని రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా త్రివిక్రమ్ టీమ్ క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో సినిమాను లాంచ్ చేసి నటీనటుల వివరాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











