For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇవ్వడానికి సిద్దమవుతున్న రానా దగ్గుబాటి.. ఇక బీభత్సమే!

  |

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మొదటి చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మలయాళం హిట్ మూవీ అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ తోనే చిత్ర యూనిట్ సభ్యులు భారీస్థాయిలో బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు.

  Pspk rana movie glimpse

  పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ భీమ్లా నాయక్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే టీజర్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఏ స్టార్ హీరో కూడా ఆ స్థాయిలో రికార్డులు అందుకోలేదు. ఆ విధంగా భారీ వ్యూవ్స్ రావడమే కాకుండా ఎక్కువ లైక్స్ ను భీమ్లా నాయక్ అందుకున్నాడు. ఇక భీమ్లా నాయక్ కు కౌంటర్ ఇవ్వడానికి రానా దగ్గుబాటి కూడా అదే తరహా డైలాగ్ తో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

  భారీ స్థాయిలోనే..

  భారీ స్థాయిలోనే..

  బాహుబలి అనంతరం రాణా దగ్గుబాటి అనుకున్నంత స్థాయిలో అయితే మరో హిట్టు అందుకోలేదు. ఇక ఇప్పుడు అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ తో తప్పకుండా భారీ స్థాయిలో పవన్ కళ్యాణ్ తో సక్సెస్ ను షేర్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సితార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో సాగర్ కి చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందిస్తున్నాడు. ఇటీవల కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా పూర్తి చేసుకున్నారు. సినిమా షూటింగ్ అయితే శరవేగంగా కొనసాగుతోంది.

  ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా

  ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా

  అసలైతే మొదట దసరా సమయంలోనే ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నమ్మకంగా అనిపించకపోవడంతో సంక్రాంతికి రావడం బెటర్ అని ఫిక్స్ అయ్యారు. సంక్రాంతి సమయంలో పెద్ద సినిమాలు పోటీగా ఉన్నప్పటికీ ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్లను అందుకోవడం పక్కా అని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంతో విడుదల తేదీపై క్లారిటీ అయితే ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ కూడా అదే తరహాలో నమ్మకాన్ని వ్యక్తం చేశాడట.

  కావాలనే తగ్గించారని..

  కావాలనే తగ్గించారని..

  అయితే మొదట మలయాళం హిట్ మూవీ అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాను చూసిన కొందరు ఈ మూవీపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న మల్టీస్టారర్ కథను సోలో హీరోకు తగ్గట్టుగా మార్చేశారని కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ డామినేషన్ గట్టిగానే ఉంటుందని, రానా దగ్గుబాటి పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండే అవకాశం ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ కోసం ఆ పాత్రను కావాలనే తగ్గించి ఉండవచ్చనే కామెంట్స్ కూడా చేశారు.

  అంచనాలకు తగ్గట్టుగానే

  అంచనాలకు తగ్గట్టుగానే

  ఫస్ట్ లుక్ టీజర్ లో రానా దగ్గుబాటి చూపించక పోవడం వల్లనే ఆ కామెంట్స్ ఎక్కువగా వైరల్ అయ్యాయి. ఇక ఆ విమర్శలపై చిత్ర యూనిట్ వెంటనే రెస్పాండ్ అయింది. ఏ విషయమైనా సరే ఒక్కొక్కటిగా మెల్లగా బయటకు వస్తుందని ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను తెరకెక్కించడం జరుగుతోందని చిత్రాన్ని నిర్మిస్తున్న నాగ వంశీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అనవసరంగా ఎలాంటి రూమర్స్ ను కూడా నమ్మవద్దని తెలిపారు.

  త్వరలోనే రానా టీజర్

  త్వరలోనే రానా టీజర్

  ఇక నెగిటివ్ టాక్ ఇంకా భారీ స్థాయిలో పెరగక ముందే వీలైనంత త్వరగా రానా దగ్గుబాటి పాత్రకు సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో రానా దగ్గుబాటి డానియల్ శేఖర్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు ఇక పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ టీజర్ లో చాలా కోపంగా రారా నా కొడకా అని డైలాగ్ చెప్పడం అందరినీ షాక్ కి గురి చేసింది.ఇక దాదాపు అదే తరహాలో రానా దగ్గుబాటి క్యారెక్టర్ కూడా భీమ్లా నాయక్ కు కౌంటర్ ఇచ్చే విధంగా ఉంటుందట.

  వీలైనంత త్వరగా.. జనాల్లోకి ఎక్కించాలని..

  వీలైనంత త్వరగా.. జనాల్లోకి ఎక్కించాలని..

  ప్రస్తుతం రానా దగ్గుబాటి టీజర్ విషయంపై కూడా డైలాగ్స్ రైటర్ త్రివిక్రమ్ నిర్మాతలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా రానా పాత్రను కూడా జనాల్లోకి ఎక్కించాలని అనుకుంటున్నారట. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ పాత్రను ఎలా రిసీవ్ చేసుకుంటారనేది మరో కీలక అంశం. ఏదేమైనా మరికొన్ని రోజుల్లో రానా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఏ మాత్రం బ్రేక్ ఇవ్వకుండా చిత్ర యూనిట్ చాలా కష్టంగా బిజీబిజీగా వర్క్ చేస్తోంది.

  ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ సినిమా షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సాగర్ కే చంద్ర ఎక్కువగా త్రివిక్రమ్ సలహాలు కూడా తీసుకుంటున్నట్లు టాక్ అయితే వస్తోంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పోటీగా రాధేశ్యామ్, సర్కారు వారి పాటు వంటి బడా హీరోల సినిమాలు ఉన్నప్పటికీ రానా - పవన్ కళ్యాణ్ పై నమ్మకంతో బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగుతున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

  English summary
  Trivikram team special focus on pspk rana another teaser release date
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X