»   »  పవన్ కళ్యాణ్ పై కత్తులు దూస్తున్న టీవి నటుడు

పవన్ కళ్యాణ్ పై కత్తులు దూస్తున్న టీవి నటుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అందుతున్న సమాచారం నిజమే అయితే ప్రముఖ టీవి నటుజు శరద్ కేల్కర్ ...పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ 2 లో విలన్ గా నటించనున్నారు. అనేకమందిని పరిశీలించిన తర్వాత పవన్ శరద్ కి ఓటేసినట్లు తెలుస్తోంది. అతను నటించిన కొన్ని ఎపిసోడ్స్ చూసిన పవన్, దర్శకుడు బాబి ఇంప్రెస్ అయినట్లు సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

శరద్ కేల్కర్ గత కొంతకాలంగా పతి పత్ని అవుర్ ఓ, కుచ్ తో లోక్ కహంగే టీవి సీరియల్స్ లో నటించారు. అలాగే రణబీర్ సింగ్, దీపిక పదుకోని నటించిన రామలీల చిత్రంలోనూ, మరాఠి చిత్రం లాయ్ భారి లోనూ నటించి ప్రశంసలు అందుకున్నారు. ఆయన కూడా సౌత్ లో ఎంట్రీ ఇవ్వాలని ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

తన తిక్క చూపించి విలన్ లెక్కల్ని తేల్చి 'గబ్బర్‌సింగ్‌' చిత్రంతో ప్రేక్షకులకు వినోదాలు పంచాడు పవన్‌ కల్యాణ్‌. ఇప్పుడు మరోసారి పోలీసు గబ్బర్‌సింగ్‌గా పవన్‌ను అదరకొట్టి అభిమానులను ఆనందపరచనున్నారు.

TV Actor Sharad Kelkar crossing swords with Pawan Kalyan

అంతా సవ్యంగా సాగితే వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అనీషా అంబ్రోస్ హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ ఈచిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

గబ్బర్ సింగ్ 2 లో ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందిట. ఆ ఫ్లాష్ బ్యాక్ లో పవన్ గెడ్డం పెంచుకుని కనపడతారని తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ గెడ్డాలతో షూటింగ్ ఎందుకని, పవన్ తనే స్వయంగా గెడ్డం పెంచుకున్నారని సమాచారం. ఈ గెడ్డంతో వచ్చే ఎపిసోడ్ సినిమాలో హైలెట్ గా నిలువనుందని చెప్పుకుంటున్నారు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తోనే ...సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు.

గత కొద్ది రోజులుగా ఈ చిత్ర దర్శకుడు బాబీ, సినిమాటోగ్రాఫర్ జయనన్ విన్సెంట్ కలిసి ఈ సినిమా కోసం మహారాష్ట్రలో లొకేషన్స్ ని వెతికారు. ఈ ఫస్ట్ షెడ్యూల్ జూన్ 5తో ముగియనుందని టాక్. ఈ షెడ్యూల్ తర్వాత... మిగిలిన లాంగ్ షెడ్యూల్స్ ని ఈ చిత్ర టీం ప్లాన్ చేసుకోనుంది. ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అనీష అంబ్రోసేని ఎంపిక చేసారు. మరో హీరోయిన్ ఖరారు కావాల్సి ఉంది.

English summary
Sharad Kelkar who is very famous on the Television circuit is playing the baddie in 'Gabbar Singh 2'.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu