»   » సింగర్ గీతామాధురి పెళ్లి తంతు...ఎంత డబ్బు వస్తుందో?

సింగర్ గీతామాధురి పెళ్లి తంతు...ఎంత డబ్బు వస్తుందో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సింగర్ గీతా మాధురి నిశ్చితార్థం నటుడు నందుతో ఇటీవల హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. వీరి వివాహం 2014 ఫిబ్రవరి నెలలో జరిగే అవకాశం ఉంది. సినిమాలతో పాటు, బుల్లితెర కార్యక్రమాల్లో తన సింగింగ్ టాలెంటుతో అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్న గీతా మాధురి నిశ్చితార్థం అనగానే బుల్లితెర ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

దీన్ని గమనించిన పలు టీవీ ఛానల్స్ ఫిబ్రవరి నెలలో జరిగే ఆమె వివాహాన్ని లైవ్ కవర్ చేసేందుకు పోటీ పడుతున్నాయి. ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో తమ టీఆర్‌పీ రేటింగులు పెరుగుతాయని భావిస్తున్నారు. గీతా మాధురి కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వారికే తన మ్యారేజ్ లైవ్ కవరేజ్ రైట్స్ ఇవ్వాలనే ఆలోచనలో ఉందట గీతా మాధురి. మరి ఎంత డబ్బు వస్తుందో? అనే విషయం ఇప్పుడు ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది.

Geetha Madhuri

గీతా మాధురి-నందు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆమధ్య వచ్చిన '100% లవ్' సినిమాతో నందు గుర్తింపు తెచ్చుకున్నాడు. 100% అందులో తమన్నాను ప్రేమించే యువకుడిగా నందు నటించాడు. కాగా... ఇటీవలే 'అదితి' అనే లఘు చిత్రంలో నందు, గీతామాధురి కలిసి నటించారు. అలా వీరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. ఇరు వర్గాల పెద్దలు అంగీకరించడంతో పెళ్లికి రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది వీరి వివాహం జరిగే అవకాశం ఉంది.

గీతా మాధురి కుటుంబ సభ్యులతో పాటు, నందు తల్లి దండ్రులు కూడా వీరి ప్రేమ వివాహానికి ఒప్పుకున్నారు. 2014లో వీరి పెళ్లి జరుగనుంది. పర్సనాలిటీ పరంగా సింగర్ గీతా మాధురికి...నందు తగిన ఈడు జోడు అని చెప్పుకోవచ్చు. ఇద్దరూ సినీరంగానికి చెందిన వారే కావడం, ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది.

English summary

 Tollywood singer Geetha Madhuri and Nandu have been seeing each other for quite some time now. The couple got engaged on last Monday at a private function in Hyderabad amidst families and friends and sparse attendance from film industry. It is learnt that the wedding will happen in February 2014. Geeta Madhuri is planning to sell the video rights of her wedding to a channel.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu