»   » ఉదయ్ కిరణ్ మృతి, తెరపైకి చిరంజీవితో బంధుత్వం మ్యాటర్?

ఉదయ్ కిరణ్ మృతి, తెరపైకి చిరంజీవితో బంధుత్వం మ్యాటర్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు యంగ్ హీరో ఉదయ్ కిరణ్ మృతి టాలీవుడ్ మొత్తాన్ని కలిచి వేసిన సంగతి తెలిసిందే. ఎంతో మంచి వ్యక్తిత్వం, యాక్టింగ్ టాలెంట్, మృదు స్వభావం కలిగిన ఉదయ్ కిరణ్ చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది. కాగా....ఉదయ్ కిరణ్ జీవితంలో చాలా కాలం క్రితం జరిగిన ఓ సంఘటన ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది.

ఉదయ్ కిరణ్‌కి చిరంజీవి కూతురుతో ఎంగేజ్మెంట్ ప్రయత్నాలు జరిగాయని, అనుకోని కారణాల వల్ల ప్రయత్నాలు ఫలించలేదనే వార్తలు గతంలో వినిపించిన సంగతి తెలిసిందే. వీరి మధ్య బంధుత్వం ప్రయత్నాలు ఎందుకు బెడిసి కొట్టాయో ఇప్పటికీ మిస్టరీనే. కాగా.....ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆ అంశం ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

Uday Kiran

చిరంజీవితో బంధుత్వం కుదిరి ఉంటే ఉదయ్ కిరణ్ కెరీర్ మరోలా ఉండేదని, అతనికి ఇలా ఆత్మహత్య చేసుకునే గతి పట్టేదనికాదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కెరీర్ మొదట్లో మంచి హిట్ హీరోగా పేరు తెచ్చుకున్నప్పటికీ .... ఆ తర్వాత వరుస ప్లాపులు ఆయన్ను ఉక్కిరి బిక్కిరి చేసాయి. అదే సమయంలో ఎవరి సపోర్టు లేక పోవడం ఉదయ్ కిరణ్ కెరీర్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది.

వరుస పరాజయాలు, సినిమా అవకాశాలు తగ్గిపోవడం, ఈ క్రమంలో చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరమైన సమస్యలు ఇలా......అనేక సమస్యలతో డిప్రెషన్‌కు లోనైన ఉదయ్ కిరణ్ వీటి నుంచి విముక్తి పొందడానికి ఆత్మహత్యే శరణ్యమని భావించాడు, అయిన వారికి, ఆత్మీయులకు, అభిమానులకు కన్నీరు మిగిల్చాడు.

English summary

 Decade back Tollywood was full of rumours about Chiranjeevi offering his elder daughter's hand to Uday Kiran. Many are now saying had that happened, Uday would have been alive in completely different platform.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu