»   » ఉగాది రోజున సర్పైజ్ ఇవ్వటానికి రామ్ చరణ్, మణిరత్నం రెడీ

ఉగాది రోజున సర్పైజ్ ఇవ్వటానికి రామ్ చరణ్, మణిరత్నం రెడీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కే అవకాసం ఉందంటూ గత కొద్ది కాలంగా వార్తలు విషయం తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమా కోసం మణిరత్నం తన భార్య సుహాసినితో కలిసి హైదరాబాద్‌కి వచ్చి చిరుతో కథా చర్చలు సాగించారు. ఆ చర్చలు ఓ కొలిక్కి వచ్చి, రామ్ చరణ్ నుంచి, చిరంజీవి నుంచి గ్రీన్ సిగ్నల్ పొందినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం విషయమై ఉగాది రోజున ప్రకటన వచ్చే అవకాసం ఉందని తెలుస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా పూర్తి యూత్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుంది.

ఇక .. మణిరత్నం ప్రస్తుతం తమిళ హీరో కార్తీతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా పూర్తి కాకముందే మణి ఈ చిత్రం ప్రి ప్రొడక్షన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మణిరత్నం తనతో సినిమా చేయడం చెర్రీ తన అదృష్టంగా భావిస్తున్నాడు. జూన్ నుంచి మణిరత్నానికి డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మణిరత్నం టీమ్ ఈ కొత్త కాంబో చిత్రానికి లొకేషన్స్ ఫైనలైజ్ చేస్తున్నారని వినికిడి. తమిళ,తెలుగు,హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాని మణిరత్నం స్వయంగా నిర్మించనున్నారు.

Ugadi surprise from Mani Ratnam, Ram Charan?

ధృవ సినిమా తనను ఎ సెంటర్ ప్రేక్షకులకు దగ్గర చేస్తుందని చెర్రీ భావించి చేసారు. దీనికి కంటిన్యూషన్ గా మణిరత్నం సినిమా చేస్తే, ఆ మార్కెట్ ను పదిలం చేసుకోవచ్చు అనుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు. అందుకే సుక్కు సినిమా తరువాతి సినిమాకు డైరక్షన్ మణిరత్నమే అని ఫిక్స్ అయిపోయాడట. పైగా బన్నీ ఎలాగూ తమిళ మార్కెట్ లో ఎంటర్ అవుతున్నాడు. అంతేకాకుండా రామ్ చరణ్ కు కూడా ఈ ప్రాజెక్టుతో అక్కడ పరిచయం అయినట్లు వుంటుందని కూడా ఆలోచిస్తున్నారట.

మరో ప్రక్క రామ్ చరణ్, సుకుమార్ డైరెక్షన్లో చేయనున్న చిత్రం జనవరి 30న లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుని నెల కావొస్తునం షూటింగ్ మొదలుకాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త కలవరం పడుతున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం సినిమా రెగ్యులర్ షూట్ ఈ నెలలోనే మొదలవుతుందని సమాచారం. మార్చి 15వ తేదీ తర్వాత చిత్రీకరణ స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది గానీ ఖచ్చితమైన తేదీ ఇంకా తెలియరాలేదు.

మైత్రీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా జగపతిబాబు, ఆది పినిశెట్టిలు కీలక పాత్రలు పోషిస్తారని అంటున్నారు.ప్రారంభోత్సవం రోజున విడుదల చేసిన ఫస్ట్ లుక్ అందరిలోనూ మంచి ఆసక్తిని రేకెత్తించింది. పూర్తిగా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రాన్ని ఎక్కువ శాతం పల్లెటూరి వాతావరణంలో చిత్రీకరించాలని భావించిన సుకుమార్ అందుకు గోదావరి జిల్లాలు, కేరళ పరిసర ప్రాంతాల్ని షూటింగ్ లొకేషన్లుగా నిర్ణయించుకున్నారు.

English summary
Discussions between Maniratnam and Ram Charan have been fruitful and that the two stars may come up with an official announcement on Ugadi Day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu